ప్రస్తుతం రాజమౌళి యమా స్పీడ్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర షూటింగ్ జరుపుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కి సంబంధించి కొంతమంది తారలు కూడా నటిస్తున్నారు. రాజమౌళి ఇలా బాలీవుడ్ తారలను తీసుకోవడానికి కారణం వాళ్లు లేకపోతే పాన్ ఇండియా అప్పీల్ రాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడు అదే అతనికి తిప్పలు తెచ్చిపెట్టినట్టు ఉంది. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ హాట్ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో ముఖ్య పాత్ర అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. అయితే అలియా భట్ యమ బిజీగా వుండడంతో ఆమె డేట్లు అసలు దొరకడం లేదు. దాంతో ఆమె రోల్ కూడా కుదించినట్టు చెబుతున్నారు. అజయ్ దేవ్‌గణ్ పరిస్థితి కూడా అంతే.
ఆయన కూడా హిందీ చిత్రాలతో బిజీగా ఉండడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ కి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. తమకు ఖాళీ దొరికినప్పుడు డేట్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ లో రాజమౌళి డేట్స్ అడిగితే హీరోలు అంతా ఇట్టే ఇచ్చేస్తారు. కానీ బాలీవుడ్ తారలు మాత్రం అతడిని తెలుగు దర్శకుడిగానే చూస్తున్నారు. అందువలన షూటింగ్ లేట్ అవుతుంది. దీనివల్ల సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందో లేదో అని టెన్షన్ పట్టుకుందట.