సాధారణంగా సినిమాకి వచ్చే రివ్యూస్, రేటింగ్స్ అసలు పట్టించుకోవద్దు అని చాలామంది స్టార్స్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే రీసెంట్ గా రాజుగారి గది-3 హీరో అశ్విన్ బాబు ప్రముఖ ఆన్ లైన్ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో విషయంలో వీరు ఇచ్చిన రేటింగ్స్ పై హర్ట్ అయ్యాడు అశ్విన్ బాబు. సినిమా అయిన తరువాత ప్రేక్షకుడికి బుక్ మై షో నుండి రేటింగ్ కోసం మెసేజ్ వస్తుంది. 100కు ఇచ్చే మార్కుల ఆధారంగా అందరి అభిప్రాయాల్ని క్రోఢీకరించి సినిమాకు రేటింగ్ ఇస్తుంది ఆ వెబ్ సైట్.
ఇలా ఈ సినిమాకి బుక్ మై షో లో 68 శాతం వచ్చింది. ఒకరకంగా ఈ సినిమాకి ఈ రేటింగ్ ఎక్కువే అని చెప్పాలి. కానీ హీరో అశ్విన్ కి ఈ రేటింగ్ విషయంలో అసంతృప్తిగానే ఉన్నాడు. నిన్న సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ... బుక్ మై షో వారు ఇచ్చిన రేటింగ్ చూసి బాధ పడ్డాను అని.. ఆ వెబ్ సైట్ వారు అందరు ఇచ్చిన రేటింగ్స్ ను పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ ఇస్తే బాగుండేదని.. కానీ వాళ్లు నెగటివ్ రేటింగ్స్ మాత్రమే తీసుకుని పెట్టారని ఆయన వింత ఆరోపణ చేశాడు.
68 శాతం రేటింగ్ వచ్చిందంటే చాలా గొప్ప విషయమే అని చెప్పాలి. కానీ అశ్విన్ బాబు ఇలా మాట్లాడటం విడ్డూరమే. ఇక ఈ సినిమా కొన్ని రోజుల్లో సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశముందని తెలుస్తుంది.