Advertisementt

వార్ సీక్వెల్ లో ఈసారి ఆ హీరో లేడా?

Wed 23rd Oct 2019 08:57 AM
hrithik roshan,tiger shroff,war movie,sequel,yash raj films  వార్ సీక్వెల్ లో ఈసారి ఆ హీరో లేడా?
Yash Raj Films planning a Sequel to the Hrithik Roshan, Tiger Shroff starrer War? వార్ సీక్వెల్ లో ఈసారి ఆ హీరో లేడా?
Advertisement
Ads by CJ

గాంధీ జయంతి రోజున బాలీవుడ్ లో హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం విడుదలైంది. ఫస్ట్ షోకే హిట్ టాక్ పడడమే కాదు... 20 రోజులకి వార్ సినిమా 300 కోట్ల క్లబులో అడుగుపెట్టేయ్యడానికి రెడీ అయ్యింది. మొదటి నుండి భారీ అంచనాలున్న వార్ సినిమా విడుదలయ్యాక కూడా రికార్డు కలెక్షన్స్ కలెక్ట్ చెయ్యడమే కాదు.. బాలీవుడ్ లో 2019 టాప్ గ్రాస్సర్ గా నిలిచింది. ఇప్పటివరకు కబీర్ సింగ్ 250 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు వార్ సినిమా కబీర్ సింగ్ ని దాటుకుని ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ముగ్దులవడంతో వార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అయితే వార్ నిర్మాతలైన యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు.. గతంలో ధూమ్ సీరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టినట్లుగా ఇప్పుడు వార్ కి సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 150 కోట్లతో వార్ సినిమా తెరకెక్కిస్తే.. దానికి డబుల్ లాభాలు రావడంతో వార్ నిర్మాతలు వార్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇక వార్ లో మాదిరిగానే వార్ సీక్వెల్ లోను హ్రితిక్ రోషన్ కొనసాగుతాడని, కానీ టైగర్ ష్రాఫ్ ప్లేస్ లోకి మరో హీరో వస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇక వార్ దర్శకుడు వార్ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తాడని చెబుతున్నారు. 

Yash Raj Films planning a Sequel to the Hrithik Roshan, Tiger Shroff starrer War?:

Tiger Shroff not in War Sequel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ