Advertisementt

RRR మూవీకి.. నాని సతీమణికి సంబంధమేంటి!?

Tue 22nd Oct 2019 09:14 PM
nani wife role,anjana,rrr movie,designer,rajamouli film  RRR మూవీకి.. నాని సతీమణికి సంబంధమేంటి!?
Whats The Role Of Nani’s Wife In RRR Movie! RRR మూవీకి.. నాని సతీమణికి సంబంధమేంటి!?
Advertisement
Ads by CJ

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులకు సింగిల్ సినిమా హిట్ పడితే పరిస్థితులు మారిపోతాయ్. ఎక్కడో ఉన్న వాళ్లు ఎక్కడిగో ఎదిగిపోతారు.. హిట్‌లు పడుతుండటం, వరుస అవకాశాలు వస్తే అదే అదునుగా తీసుకుని అప్పటి వరకూ ఉన్న రెమ్యునరేషన్‌ను కాస్త డబుల్, ట్రిబుల్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. అంతకుమించి.. భర్తలకు తామేం తక్కువ కాదంటూ.. హీరోల కంటే వాళ్ల సతీమణులే గట్టిగా సంపాదిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నానికి సతీమణికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

అదేమిటంటే.. నాని భార్య అంజనా కాస్ట్యూమ్ డిజైనర్‌. అది కూడా మామూలుగా డిజైనర్ కాదు ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పనిచేసేంత రేంజ్. బెంగళూరు నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన ఈమె.. ప్రస్తుతం రాజమౌళి ఆర్కా మీడియాలో పని చేస్తోంది. క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తోంది. బాహుబలి సినిమాకు ఈమె క్యాస్ట్యూమ్స్ డిజైన్స్ దగ్గరుండి చూసుకుంది. ఈమె జీతం లక్షల్లోనే ఉందని టాక్.. ఒక్క మాటలో చెప్పాలంటే నాని కంటే సతీమేణే గట్టిగా సంపాదిస్తోందని సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో మరి.

అంతేకాదు.. RRRకు కూడా అంజనానే కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తోందని సమాచారం. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమాకు డిజైనర్‌గా పనిచేయడానికి అంజనా ముందుకంటే కాస్త రెమ్యునరేషన్ పెంచేసిందట. అంటే RRRతో నాని సతీమణికి సంబంధాలున్నాయన్న మాట. తనవంతుగా ఆర్ఆర్ఆర్‌లో డిజైనర్ పాత్ర అంజనా పోషిస్తోంది. కాగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోలు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి.

Whats The Role Of Nani’s Wife In RRR Movie!:

Whats The Role Of Nani’s Wife In RRR Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ