కొందరకి ఫలానా.. (వస్తువు కానీ మరోటి ఏమైనా గానీ) అచ్చొచ్చింది అంటే దాన్నే ఫాలో అయిపోతూ.. అదో బాటలోనే నడిచేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే. తన 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి టాలీవుడ్‌లోని మణిశర్మ, కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్.. మరీ ముఖ్యంగా ఏఆర్ రెహమాన్‌లాంటి వాళ్లను పక్కనెట్టి బాలీవుడ్ నుంచి సంగీత దర్శకులు అమిత్ త్రివేదిని అరువు తెచ్చుకున్న విషయం విదితమే. అయితే ఈ సంగీతమే సినిమాకు ఒక ప్లస్ పాయింట్‌గా మారింది.. కాస్త తేడా కొట్టింటే పరిస్థితి మరోలా ఉండేది.
ఇక విషయానికొస్తే.. మంచి మ్యూజిక్‌తో ‘సైరా’ సక్సెస్ కావడంతో.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తన తదుపరి చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్-అతుల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వాళ్లనే తీసుకుందని కొరటాలకు చిరునే సలహా ఇచ్చారట. అంటే చిరు లెక్క ప్రకారం టాలీవుడ్‌లో తన చిత్రానికి సంగీతం అందించే దమ్ము, రేంజ్ లేదనేనా లేకుంటే అక్కడ మరేమైనా కారాణాలున్నాయా..? అని ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అప్పట్లో దేవీ శ్రీ నే కొరటాల ఫిక్స్ చేశారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ ఇప్పుడు తూచ్ అట.
డబ్బులు పెడుతున్నప్పడు సెలక్షన్ అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. అనవసరం కూడా. అయితే మెగాస్టార్ లాంటి టాలీవుడ్ పెద్ద తలకాయలే.. సొంత ఇండస్ట్రీని పక్కనెట్టేసి పక్క చూపులు చూడటం ఏంటి..? టాలీవుడ్‌ను అస్సలు ఆయన ఆదరించరా..? చిరులాంటి వాళ్లకు ఇలాంటి తగునా..? ఆదరించండి అని అందరికీ చెప్పాల్సిన చిరు ఇలా ఎందుకు చేస్తున్నట్లు..? అని బయటికి గట్టిగా చెప్పలేకపోతున్నారు కానీ.. తెలుగు సంగీత దర్శకులు మాత్రం ఒకింత తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారట. టాలీవుడ్ పట్ల ఈ చిన్న చూపు ఏల చిరంజీవీ అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు!