‘మనుషులు కాక మాన్లకు (చెట్లు) రోగాలు వస్తాయా’ అని పెద్దోళ్లు ఎక్కువ అంటుంటారు.. ఈ విషయాన్ని చాలా సార్లు మనందరం వినే ఉంటాం. అలాగే జబ్బు భారీన పడటం మానవులకు సహజమే.. అయితే వీటి నుంచి కొందరు త్వరగా కోలుకుంటారు.. మరికొందరు కోలుకోలేరు. మరీ ముఖ్యంగా కొంతమందికి అరుదైన వస్తుంటాయ్.. వాటితో తెగ ఇబ్బందులు పడుతుంటారు.. పాపం వాళ్ల పరిస్థితులు మనం మాటల్లో చెప్పలేం.
ఇక అసలు విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కొన్ని అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆ బాధలన్నీ పంటి బిగువున పెట్టుకుని భరిస్తూ మనకు వినోదాన్ని పంచుతున్నారు. తాము ఫలానా వ్యాధితో బాధపడుతున్నామని స్వయానా ఆ సెలబ్రిటీలే ఇంటర్వ్యూలు, మీడియా మీట్‌లు ఇలా పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పటికీ ఎవరెవరు ఏ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారో.. ఆ జబ్బులను ఎవరెవరు జయించారో..? వారి లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
- బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ : మియాస్థేనియా గ్రేమిస్ (కండరాలు, నాడీ తంతువుల అస్వస్థత)
- విలక్షణ నటుడు కమల్ హాసన్ : టైప్ 1 డయాబిటీస్
- సూపర్‌స్టార్ రజనీకాంత్ : ఎమిసిస్(కక్కుకోవడం)
- బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ : ట్రిజెమినల్ న్యూరల్గియా
- బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ : డిప్రెషన్ వ్యాధి
- ఇర్ఫాన్ ఖాన్ : న్యూరో ఎండోక్రైన్
- స్టార్ హీరోయిన్ సమంత : పోలోమార్పోస్ లైట్ ఎరప్షన్ (సూర్య కిరణాలు చర్మాన్ని తాకితే దద్దుర్లు రావడం)
- లేడి సూపర్‌స్టార్ నయనతార : ఈ బ్యూటీకి మేకప్ పడదు.. నాన్‌వెజ్‌కు చాలా దూరంగా ఉంటోంది!
- గోవా బ్యూటీ ఇలియానా : డిస్మోర్పిక్
- యంగ్ ఎమ్మెల్యే కేథరిన్ : అనోస్మియ (వాసనలను పసిగట్టలేకపోవడం)
- మమతా మోహన్‌దాస్ : హోడ్కివ్ లింపోమా
- అమ్మాయిల ఆరాధ్య హీరో హృతిక్ : బ్రెయిన్(మెదడు)లో చిన్న రంధ్రం ఉంది.
- సోనమ్ కపూర్ : డయాబిటీస్
- మనీషా కొయిరాలా : ఓవరియన్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు
- సోనాలి బింద్రే : అరుదైన క్యాన్సర్ బారిన పడి కోలుకుంది.
- జూనియర్ ఐశ్వర్య స్నేహ ఉల్లాల్ : ఆలో ఇమ్యూన్ డిజార్డర్
కాగా.. పైన చెప్పిన వారిలో అందరూ ట్రీట్మెంట్ తీసుకుని ఆ జబ్బు భారీ నుంచి కోలుకోవడం.. జయించడం జరిగింది. మరికొందరు మాత్రం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పైన చెప్పిన వారిలో కొందరికి ఫలానా జబ్బు ఉందని రూమర్స్ మాత్రమే ఉన్నాయి కూడా.!