Advertisementt

వంశీకి హ్యాండిచ్చిన మ‌హేష్‌.. ఆయనకు గ్రీన్ సిగ్నల్!

Tue 22nd Oct 2019 04:17 PM
mahesh,maharshi,star director prasanth neel,vamsi paidipalli  వంశీకి హ్యాండిచ్చిన మ‌హేష్‌.. ఆయనకు గ్రీన్ సిగ్నల్!
Mahesh Movie With Star Director After Sarileru Neekevvaru! వంశీకి హ్యాండిచ్చిన మ‌హేష్‌.. ఆయనకు గ్రీన్ సిగ్నల్!
Advertisement
Ads by CJ

లాంగ్ వెయిటింగ్ తర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబును వంశీ పైడిపల్లి ‘మ‌హ‌ర్షి’ని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో పాటు ఓ ట్రెండ్‌ను సెట్ చేసింది కూడా. దీంతో మహేశ్-వంశీ మధ్య బాండింగ్ బలపడి.. మంచి దోస్త్‌లుగా ఉన్నారు. ఏ రేంజ్‌లో అంటే వంశీ బుగ్గపై మహేశ్ ముద్దు పెట్టేంత రేంజ్‌కు వీళ్ల స్నేహం వెళ్లిపోయింది. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. తనకు అవకాశమిస్తే టాలీవుడ్ అందగాడితో మరో సినిమా చేయాలని వంశీ కోరడం.. ఆయన ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ పనులు కూడా చేసేశాడు పైడిపల్లి. 

అయితే సడన్‌గా ఏమైందో ఏమోగానీ.. వంశీకి హ్యాండిచ్చి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. వంశీతో సినిమా అంటే కాస్త లేటయినా అది లేటెస్ట్‌గా.. ట్రెండ్ సెట్ చేసే రేంజ్ సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే ప్రశాంత్ మాత్రం కేవలం ఆరు నెలల్లోనే సినిమా ముగించేస్తానని మహేశ్‌కు చెప్పడంతో ‘స‌రి లేరు నీకెవ్వరు’ తర్వాత త్వరగా త్వరగా ఆయనతో సినిమా చేయాలని మహేశ్ ఫిక్స్ అయ్యారట. సంక్రాంతి తర్వాత నీల్ క‌థ‌కి టేకాఫ్ మొద‌లైపోతుంద‌ని టాక్.. అంటే వంశీ మళ్లీ వెయిటింగ్‌ లిస్టే అన్న మాట.

వాస్తవానికి సంక్రాంతి తర్వాత రెండు నెలల పాటు మహేశ్‌కు రెస్ట్ ఇచ్చి సమ్మర్‌లో షూటింగ్ షురూ చేద్దామని వంశీ భావించారు. అయితే అనుకోకుండా స్వయంగా మహేశ్.. నీల్‌కు కాల్ చేయడం.. ఆయన సరే సార్ అనడం ఇవన్నీ చకచకా జరగిపోయాయట. కేజీఎఫ్ సినిమా కలలో కూడా ఊహించని రేంజ్‌లో భారీ హిట్ అవ్వడం.. సింగిల్ సినిమాతోనే హీరో, డైరెక్టర్‌ స్టార్ల జాబితాలో చేరిపోవడంతో అందరూ నీల్ కోసం క్యూ కడుతున్నారు. అయితే మహేశ్‌కు ఏ రేంజ్‌ కథ ప్రశాంత్ రాసి పట్టుకొస్తారో..? అది ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చుతుందో వేచి చూడాలి మరి.

Mahesh Movie With Star Director After Sarileru Neekevvaru!:

Mahesh Movie With Star Director After Sarileru Neekevvaru!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ