Advertisementt

బిగ్‌బాస్ తర్వాత రీమేక్ మూవీలో నాగ్!

Tue 22nd Oct 2019 12:58 PM
nagarjuna,hindi remake,bigg boss-3,bangarraju  బిగ్‌బాస్ తర్వాత రీమేక్ మూవీలో నాగ్!
Nagarjuna Acts In Hindi Remake Movie After Bigg Boss Completion! బిగ్‌బాస్ తర్వాత రీమేక్ మూవీలో నాగ్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున నవంబర్‌లో బాగా బాగా బిజీబిజీ కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్-3 షో వ్యాఖ్యతగా ఉన్న మన్మథుడు.. అది కాస్త పూర్తవ్వగానే హిందీ రీమేక్‌లో చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వాస్తవానికి ఈ మధ్య నాగ్‌కు గట్టి పడి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడో ‘సోగ్గాడే చిన్నినాయన’ హిట్టవ్వగా.. కొన్ని నెలల క్రితం వచ్చిన ‘మన్మథుడు-2’ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో నాగ్‌ ఇమేజ్‌ చాలా తగ్గింది.. అయితే ఆ లోటు కాస్త బిగ్‌బాస్‌తో పూడ్చుకున్నారు.. అది ఫేమా..? పైసలా..? అనేది ఇక్కడ అనవసరం. ఈ షో అవ్వగానే.. తనకు ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో.. నాగ్-నాగ్ చైతన్య కాంబినేషన్‌లో ‘బంగర్రాజు’ సీక్వెల్ సినిమా తెరకెక్కించాలని భావించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించనుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో ఈ సినిమాను మొదలుపెట్టి.. వ‌చ్చే ఏడాదే వేస‌విలో బంగార్రాజుని విడుద‌ల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే మధ్యలో ఈ హిందీ రీమేక్ అని టాక్ వచ్చింది. మరీ ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? హిట్టిచ్చిన దర్శకుడికి ఏం చెప్పి నాగ్ మేనేజ్ చేస్తాడో వేచి చూడాల్సిందే మరి.

Nagarjuna Acts In Hindi Remake Movie After Bigg Boss Completion!:

Nagarjuna Acts In Hindi Remake Movie After Bigg Boss Completion!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ