‘రాజుగారి గది- 3’ విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అశ్విన్ ను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు. ప్రేక్షుకుల సపోర్ట్ ఉంటే ఎవ్వరూ ఎక్కడికైనా వెళుతారు. వైజాగ్ మెలోడీ థియేటర్ లో పెద్ద హీరో షోస్ కు మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా రాజు గారి గది 3 ఫుల్స్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆధరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాకోసం పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.
ఆలీ మాట్లాడుతూ... ‘రాజుగారి గది-3ను బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్‌కు థ్యాంక్స్. ఈ సినిమాను అందరూ కష్టపడి పని చెయ్యడంతోనే ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రం నేను కూకట్‌పల్లిలో చూశాను. ఆడియన్స్ సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుకు ఆదరిస్తున్నారు.. ఈ చిత్రం విజయం సాధించడానికి వారి సపోర్ట్ చాలు’ అని అలీ చెప్పుకొచ్చారు.
చోటా కె నాయుడు మాట్లాడుతూ.. ‘సినిమాను వినోదం కోసం తీస్తారు. ఈ సినిమాలో అది ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 4 కోట్ల గ్రాస్ చేసింది ఈ సినిమా. అశ్విన్ ఈ సినిమా ప్రాణం పెట్టి తీసాడు. మంచి సినిమాను అందరూ ఆదరించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
అశ్విన్ మాట్లాడుతూ.. ‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. నాకు ఈ సినిమాతో ఒక మార్కెట్ ఓపెన్ అయ్యిందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. అందుకు సంతోషం.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెబుతున్నారు. బుక్ మై షో రేటింగ్స్‌ను చూసి నేను బాధ పడ్డాను. బుక్ మై షో వారు అందరి రేటింగ్స్‌ను పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ ఇస్తే బాగుండేది. వారు కేవలం నెగిటివ్ రేటింగ్స్ తీసుకొని పెడుతున్నారు. నేను, అవికా థియేటర్స్ విజిట్ చేశాము, రెస్పాన్స్ చేస్తుంటే అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులను అడిగి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని సినిమా ప్రేక్షకులు చూడాలి’ అని కోరారు.
హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. ‘థియేటర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్బ్‌గా ఉంది. నన్ను తెలుగులో ఇంత బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ మాట్లాడుతూ.. ‘అందరికి నమస్కారం. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఓంకార్ గారికి ధన్యవాదాలు. రాజు గారి గది 3 చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు థియేటర్స్ లో కూడా ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ‘నేను ఓంకార్ అన్నయ్యకు ఏకలవ్య శిష్యుడిని, ఇప్పుడు ఆయన సినిమాలో నటించడం సంతోషం. థియేటర్‌లో ఆలీ గారి కామెడీకి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. చోటా గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్స్’ అని తెలిపారు.