Advertisementt

విజయ్ దేవరకొండ 'హీరో'కి బ్రేకులు పడలేదు!!

Mon 21st Oct 2019 08:32 PM
vijay devarakonda,vijay new movie,world famous lover,malavika mohan  విజయ్ దేవరకొండ 'హీరో'కి బ్రేకులు పడలేదు!!
News About Vijay Devarakonda New Movie! విజయ్ దేవరకొండ 'హీరో'కి బ్రేకులు పడలేదు!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌లో యమా ఫామ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ హీరో అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని ఆనంద్ అన్నామలై అనే డైరెక్టర్ తెలుగు, తమిళంలలో రూపొందించనున్నారు. ఇది బైక్ రేసింగ్‌కి సంబంధించి సినిమా అని తెలిసిన విషయమే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈసినిమా కోసం 50 కోట్లు ఖర్చు చేస్తునట్టు తెలుస్తోంది.

అయితే ఈసినిమా షూటింగ్ సగంలో ఆగిపోయిందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కారణాలు ఏవో కానీ మూవీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రం యూనిట్ కూడా ఎక్కడ స్పందించలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇవ్వని ఒట్టి పుకార్లు మాత్రమేనని తెలుస్తోంది. సినిమా ఆగిపోలేదని తెలుస్తుంది.

నవంబర్‌లో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈమూవీ కోసం విజయ్ అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నాడు. ఇందులో హీరోయిన్‌గా తమిళ నటి మాళవిక మోహనన్ నటిస్తుంది. ప్రస్తుతం విజయ్ ఈమూవీతో పాటు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు.

News About Vijay Devarakonda New Movie!:

News About Vijay Devarakonda New Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ