‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమా హిట్‌తో విజయ్ దేవరకొండకి క్రేజ్ పెరగడమే కాదు.. అతనికి తన సినిమాల మీద కాన్ఫిడెన్స్ ఓ లెవల్లో పెరిగింది. ‘నోటా’ సినిమాలా ప్లాప్ అవకూడదని.. డియర్ కామ్రేడ్ విషయంలో విజయ్ దేవరకొండ తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. భరత్ కమ్మ కొత్త దర్శకుడు కావడంతో.. విజయ్ దేవరకొండ చెప్పింది చెయ్యక తప్పలేదు. ఎడిటింగ్ దగ్గరనుండి సినిమా ప్రమోషన్స్ వరకు విజయ్ దేవరకొండనే అన్ని చూసుకున్నాడు. కానీ ఆ సినిమా పై విజయ్ పెంచుకున్న కాన్ఫిడెన్స్ మొత్తం ఆ సినిమా ప్లాప్ అవడంతో ఎగిరిపోయింది. ఆ దెబ్బకి పూరీని కూడా లైన్‌లో పెట్టాడు విజయ్.
అయితే ‘డియర్ కామ్రేడ్’ దెబ్బకి కాస్త విజయ్ లైన్‌లోకొచ్చి దర్శకనిర్మాతలకు విలువిస్తాడనే అనుకున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమా విషయంలోనూ ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నాడట. అంటే షూటింగ్ కంప్లీట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం తానే చూసుకుంటానని..‘నా ఫాన్స్‌కి సినిమాని నచ్చేలా ప్రమోట్ చేస్తాను’ అని దర్శకనిర్మాతలకు చెబుతున్నాడట. ఒక దెబ్బతగిలినా తీరు మార్చుకొని విజయ్ దేవరకొండపై కోపమొచ్చింది.. స్టార్ హీరో రేంజ్ కాబట్టి దర్శకనిర్మాతలు సైలెంట్ అవుతున్నారట. మరి పోస్ట్ ప్రొడక్షన్ దశలో సినిమా మీద డౌట్ వస్తే.. మళ్ళీ రీ షూట్స్ చేయించేలా విజయ్ ఉన్నాడని అంటున్నారు.