Advertisementt

‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’ సక్సెస్ మీట్

Sun 20th Oct 2019 10:42 PM
krishna rao supermarket,success meet,comedian gowtham raju son,tollywood  ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’ సక్సెస్ మీట్
Krishna Rao Supermarket Success Meet ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’ సక్సెస్ మీట్
Advertisement
Ads by CJ

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’. శ్రీనాధ్‌ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం అక్టోబర్‌ 18న గ్రాండ్‌ గా  రిలీజ్‌ అయ్యి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో...

నటుడు గౌతంరాజు మాట్లాడుతూ.. ‘మా సినిమా కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ యూత్ ఫుల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది. మా సినిమాకు అన్ని పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన మీడియాకి నా ధన్యవాదాలు. క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ అలానే సస్టైన్ అయ్యి ఆడియన్ ని థ్రిల్ చేస్తుంది. మా డైరెక్టర్ కొత్త వారైనా   స్క్రీన్ ప్లే చాలా కొత్తగా నడిపి సినిమాను ఒక ఎత్తుకు తీసుకెళ్లాడు. అలాగే మా అబ్బాయి కృష్ణ ముందు నుండి చిరంజీవి గారి అభిమాని. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ఈ సినిమాలో బాక్సర్ పాత్ర కోసం బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. మా టీం అందరికీ.. మంచి సినిమా చేశారు అని అప్రిసియేషన్ వస్తోంది. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చి 33 సంవత్సరాలు అయింది. చాలా మందికి చాలా విధాలుగా సాయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు మీ మీడియాకు నా మనవి ఏంటంటే.. మా సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లండి. ఇంకా మంచి హైప్ వచ్చేలా చేయండి’. దానివ‌ల్ల మరి కొంత మందికి సహాయం చేసే అవకాశం లభిస్తుంది’ అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ... ‘సినిమా పాజిటివ్ వైబ్స్‌తో వెళుతుంది. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చేసిన మా డైరెక్టర్ గారికి థాంక్స్. ముఖ్యంగా సస్పెన్స్ బాగా సస్టైన్ చేశారని మంచి అప్లాజ్ వస్తోంది. యంగ్ టీమ్ చాలా కష్టపడి సినిమా చేశాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి’ అన్నారు.

డైరెక్టర్ శ్రీనాధ్‌ పులకరం మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజై మా సక్సెస్‌ను మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది అని ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఎక్కడో ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఈ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా స్ట్రగుల్స్‌ని దాటి  ఎంతో కష్టపడి సినిమా తీశాం. దయచేసి మీడియా సపోర్ట్ చేయండి’ అన్నారు.

నటీనటులు:-  కృష్ణ, ఎల్సాగోష్‌, తనికెళ్ళభరణి, గౌతంరాజ్‌, బెనర్జీ, రవిప్రకాష్‌, సూర్య, సన, దొరబాబు, సంజు, సహస్ర, తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి

మ్యూజిక్‌: బోలే షవాలీ

కెమెరామెన్‌: ఎ. విజయ్‌కుమార్‌

ఎడిటర్‌: మార్తాండ్‌, కె.వెంకటేష్‌

ప్రాజెక్ట్‌ అడ్వైజర్‌ : కె. భువన్‌ రెడ్డి

నిర్మాత: బిజెఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌

దర్శకుడు: శ్రీనాధ్‌ పులకురమ్‌.

Krishna Rao Supermarket Success Meet:

>Krishna Rao Supermarket Success Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ