Advertisementt

50 కోట్ల లాస్‌లో ‘సైరా’.. చరణ్ ప్లానేంటి?

Sun 20th Oct 2019 07:28 PM
ram charan,sye raa narasimha reddy,chiranjeevi,loss,50 crores  50 కోట్ల లాస్‌లో ‘సైరా’.. చరణ్ ప్లానేంటి?
50 Crore Loss to Sye Raa Narasimha Reddy 50 కోట్ల లాస్‌లో ‘సైరా’.. చరణ్ ప్లానేంటి?
Advertisement
Ads by CJ

చిరంజీవి ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన సైరా సందడి అణిగిపోయింది. రెండేళ్ల నిరీక్షణకు సైరా మంచి ఫలితమే ఇచ్చింది. మెగా ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు... అందరికి సైరా సినిమా నచ్చింది. కానీ వసూళ్లు చూస్తే కన్నీళ్లు వచ్చేలా కనబడుతుంది. తండ్రి సినిమాల్తో లాభాలు మూట గట్టుకుంటున్న రామ్ చరణ్ కి ఏమోకానీ.. సై రా సినిమాని భారీ రేట్లకి కొనుగోలు చేసిన బయ్యర్ల గగ్గోలు మొదలయ్యాయి. చిరు స్టామినాతో అధిక రేట్లకు కొన్న బయ్యర్లకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన సైరా నరసింహారెడ్డికి టోటల్ గా అంటే అన్ని ఏరియాలను కలిపి 50 కోట్ల నష్టాలు ఖాయంగా కనబడుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పితే సై రా సినిమా మరే భాషలోనూ సత్తా చాటలేకపోయింది. హిందీలో మరీ ఘోరం. విడుదలైనప్పటినుండి ఇప్పటివరకు 5.5 కోట్లు అంటే సైరా పరిస్థితి అర్ధమవుతుంది. ఇక తమిళ, మలయాళ, కన్నడలలో కూడా పర్వాలేదనించిన సైరాకి ఇప్పటివరకు 145 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ వారంలోను తెలుగులో మంచి సినిమాలు లేని కారణంగా మహా ఆడితే ఇక్కడ రెండు కోట్లు ఇతర భాషల్లో మరో రెండు కోట్లు కలిపితే.. ఓ ఐదు కోట్లు సైరాకు రావొచ్చు. మరి ఓవరాల్‌గా సైరా బయ్యర్లకు 50 కోట్ల లాస్ వచ్చినట్లే. మరి ఈ 50 కోట్లని రామ్ చరణ్ రికవరీ చేస్తాడో లేదంటే చిరు తర్వాత సినిమాకు కూడా చరణే నిర్మాత కాబట్టి ఆ సినిమాకు చూసుకుందాం అంటాడో చూడాలి.

50 Crore Loss to Sye Raa Narasimha Reddy:

What is The Ram Charan Plan on Sye Raa loss?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ