Advertisementt

నయన్‌పై మెగా ఫ్యాన్స్ కూడా గుస్సా..!

Sun 20th Oct 2019 12:54 PM
sye raa,mega fans,nayanthara,angry,tamanna  నయన్‌పై మెగా ఫ్యాన్స్ కూడా గుస్సా..!
Mega Fans Angry on Nayanthara నయన్‌పై మెగా ఫ్యాన్స్ కూడా గుస్సా..!
Advertisement
Ads by CJ

సైరా సినిమా విడుదలై అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా సైరా సినిమా మెయిన్ హీరోయిన్ నయనతార సినిమా యూనిట్ మీద ఆగ్రహంతో ఉన్నట్లుగా టాలీవుడ్, కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఎందుకంటే మెయిన్ హీరోయిన్ గా తాను నటిస్తే సినిమాలో మాత్రం సెకండ్ హీరోయిన్ తమన్నాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో నయన్ గుస్సా అయినట్లుగా టాక్. సినిమా విడుదల ప్రమోషన్స్ కి రాని నయనతార ఇప్పుడు ఇలా తమన్నాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోపం తెచ్చుకోవడం ఎంతవరకు న్యాయమంటున్నారు మెగా ఫాన్స్.

చిరంజీవి సైరా సినిమా ప్రమోషన్స్ కి రాకుండా హ్యాండ్ ఇచ్చి ఇపుడు తన పాత్రకి ప్రాధాన్యత లేదనడం విడ్డూరంగా ఉందంటున్నారు. అయితే నయనతార సినిమాలో మెయిన్ లీడ్ కాబట్టి ఆమె పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే.. సినిమా విడుదలయ్యాక తమన్నా కేరెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి తమన్నాని కేవలం గెస్ట్ రోల్ అనుకుంటే.. చివరికి సినిమాకే కీలకం చేసి.. నయన్ ని గెస్ట్ గా నిలబెట్టేసారు. అందుకే నయనతార తన బాధని తన సన్నిహితుల దగ్గర వెళ్లగక్కుతుందట.

Mega Fans Angry on Nayanthara:

Nayanthara Angry on Tamanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ