Advertisementt

‘ఇండియన్ 2’: ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చా?

Sat 19th Oct 2019 03:22 PM
indian 2,kamal haasan,budget,shankar,indian 2 movie  ‘ఇండియన్ 2’: ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చా?
Indian 2 Movie Latest Update ‘ఇండియన్ 2’: ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చా?
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఇండియన్ 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది. కమల్‌కి జోడిగా కాజల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో కమల్ హాసన్ మొదటి పార్ట్ లానే వృద్దుడి గెటప్‌లో కనిపించనున్నారు. అయితే ఈసారి కమల్‌ది 90 ఏళ్ల వృద్దుడి పాత్ర అని సమాచారం. ఇక ఈచిత్రంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తెలియజేసారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎపిసోడ్ భోపాల్ లో పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్‌పై తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఈ షెడ్యూల్ అయిన వెంటనే టీం అంతా మరో షెడ్యూల్ కోసం తైవాన్ మరియు యూరప్ వెళ్లి అక్కడ షూట్ చేయనున్నారు. ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Indian 2 Movie Latest Update:

40 Crore Budget for Indian 2 Movie Single Fight Episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ