Advertisementt

రామ్.. ఆ రీమేక్‌‌కు ఓకే చెప్పాడంట..!

Sat 19th Oct 2019 01:27 PM
energetic star,ram,telugu remake,thadam,kishore tirumala,ram in remake  రామ్.. ఆ రీమేక్‌‌కు ఓకే చెప్పాడంట..!
Hero Ram Green signal to Thadam remake రామ్.. ఆ రీమేక్‌‌కు ఓకే చెప్పాడంట..!
Advertisement
Ads by CJ

‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించిన రామ్ నెక్స్ట్ ఏం చేయాలో అని డైలమాలో ఉన్నాడు. నెక్స్ట్ కొత్త త‌ర‌హా సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది అర్ధం కావడం లేదు రామ్‌కి. మళ్లీ మాస్ సినిమా చేసినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని ఆలోచనలో ఉన్న రామ్‌కి తమిళ చిత్రం త‌డమ్ రీమేక్‌లో నటించాలనే ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. రామ్ ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

మొదట ఈసినిమా చేయకూడదు అని భావించిన రామ్.. మళ్లీ ఏమనుకున్నాడో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్‌తో ‘నేను శైలజ, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ’ సినిమాలు తీసిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలోనే రామ్ త‌డ‌మ్ రీమేక్ చేయ‌బోతున్నాడని టాక్. హీరోయిన్స్‌గా నివేతా పేతురాజ్‌, మాళ‌విక శ‌ర్మ నటించనున్నారు.

తమిళంలో తడమ్ హిట్ అయిన వెంటనే రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ రైట్స్ సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుందని.. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ చేయాలని చూస్తున్నాట్లుగా సమాచారం.

Hero Ram Green signal to Thadam remake:

Energetic Star Ram to star in the Telugu remake of Thadam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ