త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు నివేతా పేతురాజ్ కూడా ఒక పాత్రలో నటిస్తుందని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్ అయిపోయింది. ‘అత్తారింటికి దారేది’ నుంచి మొన్నొచ్చిన ‘అరవింద సమేత’ వరకూ త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కామన్.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్. ఇందులో నివేతా పేతురాజ్ సెకండ్ లీడ్‌లో కనిపించనుంది. అయితే ఇంతవరకు త్రివిక్రమ్.. నివేతా క్యారెక్టర్ ఏంటనేది ఎక్కడా రివీల్ చేయలేదు. అసలు ఈమూవీలో ఈమెది స్కోప్ ఉండే క్యారక్టరా? లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. సాధారణంగా స్వామి సినిమాలో సెకండ్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఇందులో నివేతా క్యారెక్టర్ ఏంటో? తెలియడంలేదు.
కనీసం టీజర్‌లోనో లేదా ఏదైనా క్యారెక్టర్ పోస్టర్‌లోనూ నివేతా గురించి చెప్తే తప్ప సినిమాలో ఆమెను ఎందుకు తీసుకున్నారనే విషయం బయటికి రాదు. మరి గురూజీ ఏం ఆలోచిస్తాడో చూడాలి. ఇక ఈమూవీ సంక్రాంతి సీజన్‌లో జనవరి 12న రిలీజ్ కానుంది.