Advertisementt

‘జార్జ్ రెడ్డి’ నైజాం రైట్స్ ఎవరికంటే..?

Sat 19th Oct 2019 11:51 AM
george reddy,nizam rights,global cinemas  ‘జార్జ్ రెడ్డి’ నైజాం రైట్స్ ఎవరికంటే..?
George Reddy movie Nizam rights Sold Out ‘జార్జ్ రెడ్డి’ నైజాం రైట్స్ ఎవరికంటే..?
Advertisement
Ads by CJ

‘జార్జ్ రెడ్డి’ నైజాం రైట్స్ సొంతం చేసుకున్న గ్లోబల్ సినిమాస్

ట్రైలర్‌తో అంచనాలు పెంచిన జార్జిరెడ్డి సినిమాకు బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్‌ను ఇటీవలే అభిషేక్ పిక్చర్స్-అభిషేక్ నామా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ నుండి నైజాం హక్కులను గ్లోబల్ సినిమాస్ అధినేత సునీల్ నారాంగ్ మంచి ఫ్యాన్సీ ఆఫర్ చేసి దక్కించుకున్నారు.. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సాంకేతికవర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

George Reddy movie Nizam rights Sold Out :

George Reddy movie Nizam rights bagged by Global Cinemas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ