Advertisementt

చైతూకి కన్నడ భామ ఝలక్..!

Fri 18th Oct 2019 07:23 PM
rashmika mandanna,naga chaitanya,dil raju,heroine,out  చైతూకి కన్నడ భామ ఝలక్..!
Rashmika Mandanna Jhalak to Naga Chaitanya చైతూకి కన్నడ భామ ఝలక్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్ కన్నడ భామ రష్మిక. కన్నడ ఇండస్ట్రీలో కన్నా ఎక్కువగా రష్మిక తెలుగు పిల్ల అయ్యింది. గీత గోవిందంతో అందరి ఇంట్లో గీతలా ఫేమస్ అయిన రష్మిక, మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన ‘సరిలేరు నీకెవ్వరు’ అంటుంది. అంతేకాకుండా నితిన్ భీష్మ సినిమాలోనూ నటిస్తుంది. తెలుగు, తమిళ సినిమాల్తో క్షణం తీరిక లేని రష్మికకి మరో స్టార్ హీరో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో కూడా హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనే ప్రచారం ఉంది.

అలాగే దిల్ రాజు నిర్మాతగా నాగ చైతన్య హీరోగా ఓ సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఆ సినిమాలో రష్మికనే హీరోయిన్ అని జెమిని ఛానల్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకంటే చైతు - రష్మికల సినిమా శాటిలైట్ హక్కులను మేమే సొంతం చేసుకున్నామంటూ ట్వీట్ చేసింది జెమిని ఛానల్. చైతు రీసెంట్ మూవీస్ వెంకీమామ సినిమా విడుదల కావడం, శేఖర్ కమ్ముల సినిమా పూర్తి కాగానే చైతు - రష్మిక ల సినిమా పట్టాలెక్కుతోంది అని అనుకున్నారు. అయితే తాజాగా రష్మిక, నాగ చైతన్యకి షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. తాను ఈ సినిమా చెయ్యలేనని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి డేట్స్ ప్రాబ్లమా? చిన్న హీరో అని ఆలోచించిందా? అనేది తెలియదు కానీ.. రష్మిక మాత్రం చైతు - దిల్ రాజు సినిమాలో చెయ్యడం లేదనేది ఫిలింనగర్ టాక్. రష్మిక కాదనడంతో చైతూ కోసం మరో హీరోయిన్‌ని వెతికే పనిలో టీం ఉన్నట్లుగా సమాచారం.

Rashmika Mandanna Jhalak to Naga Chaitanya:

Rashmika Mandanna Out From Naga Chaitanya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ