సైరా తరువాత టాలీవుడ్‌లో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. గోపీచంద్ చాణక్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇక ఈవారం అంటే రేపు నాలుగుస్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదటిగా రాజు గారి గది 3. ఈమూవీపై పెద్దగా అంచనాలు లేవు. కానీ కామెడీతో టైంపాస్ అయిపోతుందని సినీ లవర్స్ భావిస్తున్నారు. హీరోగా అశ్విన్ బాబు.. హీరోయిన్ గా అవికా గోర్ కి పెద్ద ఇమేజ్ లేకపోవడంతో ఈసినిమా మౌత్ టాక్ బట్టే నడవాలి.
ఇక సాయి కుమార్ కొడుకు ఆది నటించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా ఇంచుమించు అంతే ఉంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కశ్మీరీ పండిట్‌ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రంలా కనిపిస్తుంది. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప దీని కోసం ప్రత్యేకించి థియేటర్స్‌కి వెళ్ళరు జనాలు.
అలానే ఈ రెండింటితో పాటు మరో చిన్న సినిమా కూడా అదే రోజు వస్తోంది. కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే ఈసినిమా గురించి ఎవరికి పెద్దగా అవగాహనా కూడా లేదు. అసలు ఈమూవీ రేపు రిలీజ్ అవుతుందని ఎవరికి తెలియదు అంటే ఈసినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇక నాలుగో సినిమా విషయానికొస్తే.. క్రిషి క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ కొణిదెన హీరోగా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యుబైఎ సర్టిఫికెట్ పొందింది. అక్టోబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం నిలబడుతుందో వెయిట్ అండ్ సీ.