Advertisementt

ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది: మహేష్ బాబు

Thu 17th Oct 2019 04:10 PM
meeku matrame chepta,mahesh babu,vijay deverakonda,tharun bhascker,anchor anasuya  ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది: మహేష్ బాబు
Meeku Matrame Chepta Movie Trailer Launch By Mahesh Babu ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది: మహేష్ బాబు
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ లాంఛ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది. విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. పెళ్ళి చూపులు నాకు బాగా నచ్చిన సినిమా, విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీం అందరికీ అల్  ద బెస్ట్’ అన్నారు.

నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘ఈ కాన్సెప్ట్ బాగా నచ్చి నేనే ప్రొడ్యూస్ చేసాను. నిర్మాత బాధ్యతలు మా నాన్న గారు వర్ధన్ దేవరకొండ తీసుకున్నారు. నా ఫేవరేట్ హీరో మహేష్ బాబు గారు ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా అందంగా ఉంది. అడగగానే సపోర్ట్ చేసిన మహేష్ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా నా మనసుకు నచ్చిన సినిమా, ట్రైలర్ మీకు బాగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను’ అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నన్ను హీరో అంటున్నారు. కానీ ఆర్టిస్ట్ గానే నేను భావిస్తున్నాను. అందరికీ రిలీట్ అయ్యే కాన్సెప్ట్ ని దర్శకుడు షకీర్ బాగా హ్యాండిల్ చేసాడు. కథా, కథనాలు సూపర్ ఫన్ గా ఉంటాయి. విజయ్ ప్రొడక్షన్ లో చేస్తున్నాను అనే రెస్పాన్సిబిలిటీ తో పని చేసాను. ఈ మూవీ ట్రైలర్ లంచ్ చేసిన మహేష్ సర్ కి చాలా థాంక్స్’ అన్నారు.

అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘ ట్రైలర్‌లో ఎంత ఫన్ ఉందో అంతకు మించి సినిమా లో ఉంటుంది. తరుణ్ చాలా బాగా చేసాడు. ఒక మంచి సినిమా తో మీ ముందుకు వస్తున్నాం అనే నమ్మకం ఉంది’ అన్నారు.

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ..‘ఈ సినిమా చేయడానికి నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది కథ. తరుణ్ హీరో అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తన రోల్ ని బాగా చేసాడు. ప్రొడక్షన్ హౌస్ కూడా మొదటి సినిమా అనే ఫీల్ ఎప్పుడూ కలిగించలేదు. ఒక యంగ్ టీం అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

వాణి భోజన్ మాట్లాడుతూ.. ‘ఒక వండర్ ఫుల్ టీం తో పని చేసాను. నా క్యారెక్టర్ ప్రతి అమ్మాయి కి బాగా కనెక్ట్ అవుతుంది. తరుణ్ యాక్టింగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు’అన్నారు.

దర్శకుడు షమ్మీర్ సుల్తాన్  మాట్లాడుతూ..‘నాకు అవకాశం ఇచ్చిన విజయ్ కి చాలా థాంక్స్. ఈ మూవీ ఒక ఇన్సిడెంట్ బేస్డ్ గా ఉంటుంది. ఈ మూవీ కి డైలాగ్స్ రాసిన తరుణ్ కి థాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాం. ట్రైలర్ లంచ్ చేసిన మహేష్ సర్ కి థాంక్స్’అన్నారు.

నవీన్ జార్జ్ థామస్ మాట్లాడుతూ.. ‘షమ్మీర్ నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి పని చేసాము. ఈ కాన్సెప్ట్ ని నమ్మి ప్రొడ్యూస్ చేసిన విజయ్ దేవరకొండ కు చాలా థాంక్స్. నా క్యారెక్టర్ మీకు చాలా ఫన్ అందిస్తుంది’ అన్నారు.

‘మీకు మాత్రమే చెప్తా’లో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్ తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా

సంగీతం : శివకుమార్

ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్

కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ

పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా

లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ

రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.

Meeku Matrame Chepta Movie Trailer Launch By Mahesh Babu:

Meeku Matrame Chepta Movie Trailer Launch By Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ