Advertisementt

ఓయ్ షాలినీ పాండే.. ఈ వేషాలేంటి?

Thu 17th Oct 2019 03:33 PM
shalini pandey,arjun reddy,producers,bollywood chance,manager  ఓయ్ షాలినీ పాండే.. ఈ వేషాలేంటి?
Producers Fired on Arjun Reddy Fame Shalini Pandey ఓయ్ షాలినీ పాండే.. ఈ వేషాలేంటి?
Advertisement
Ads by CJ

మొదటి సినిమా అర్జున్ రెడ్డితో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా తరువాత టాలీవుడ్‌లో కళ్యాణ్ రామ్ తో 118 అనే సినిమా చేసి పర్లేదు అనిపించుకుంది. కాకపోతే తమిళంలో సినిమాలు చేస్తున్న షాలిని ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో నటిస్తుంది. అలానే అనుష్కతో నిశ్శబ్ధంలో నటిస్తోంది. అంతేకాదు తమిళంలో రెండుమూడు చిత్రాలు కమిట్ అయ్యి నటిస్తున్న షాలిని కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ రాగానే వెంటనే ముంబై కి మాకం మార్చేసింది.

ఇక్కడ మూవీస్‌కి డేట్స్ ఇచ్చి, షూటింగ్ కంప్లీట్ చేయకుండా ముంబయి వెళ్లిపోవడమేంటని నిర్మాతలు ఫైర్‌ అవుతున్నారు. షాలిని మేనేజర్‌ని కాంటాక్ట్ చేస్తే ఆ మేనేజర్‌కే ఆమె అందుబాటులో లేదని తెలుస్తుంది. మేనేజర్‌ని కూడా మార్చేసిందని, ముంబై లో కొత్త పీఆర్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుందని తెలుస్తుంది. దీంతో షాలినికి వచ్చిన ఆ హిందీ అవకాశాన్ని చెడగొట్టి అయినా ఇక్కడి సినిమాలు పూర్తి చేయించాలని నిర్మాతలు సీరియస్‌ అవుతున్నారు. ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి అవసరమయితే నష్ట పరిహారం వసూలు చేయాలని కూడా చూస్తున్నారు.

Producers Fired on Arjun Reddy Fame Shalini Pandey:

Shalini Pandey not Available to Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ