మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్’లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మరో కీలక పాత్రలో ఫృథ్వీరాజ్ నటించి డైరెక్షన్ చేసారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ దాని రైట్స్ కొన్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికీ ఈసినిమా నచ్చడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు.
ఈ విషయాన్నీ చిరంజీవియే స్వయంగా చెప్పారు. అయితే ఇప్పుడు లూసీఫర్ రీమేక్ విషయంలో చిరంజీవి పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. నిజానికి ఈసినిమాని చిరంజీవి డైరెక్ట్‌గా కొనలేదు. తనకు సినిమా బాగా నచ్చిందని ఆ విషయాన్నీ ఎన్వీ ప్రసాద్‌తో చర్చిస్తుంటే.. ఆయన ఆఘమేఘాల మీద ‘లూసీఫర్’ రీమేక్ రైట్స్ కొనుక్కొచ్చేశారట.
మన తెలుగులో ఈసినిమాను రీమేక్ చేస్తే కచ్చితంగా చాలా మార్పులు చేయాల్సివస్తుంది. లేదంటే మన తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఇలాంటి సినిమాలు నచ్చవు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈసినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదలైందని, అది రెండు రోజులకు మించి ఆడలేదన్న విషయం చిరు గుర్తించి – లూసీఫర్‌ని రీమేక్ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.