శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం ప్రీ రిలీజ్ ఈవెంట్. అక్టోబర్ 18న సరోవరం గ్రాండ్ రిలీజ్
శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.శ్రీలత మాట్లాడుతూ.. ‘‘సరోవరం సినిమాను అందరూ ఇష్టపడి తీసాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు, మీడియా వారికి ధన్యవాదాలు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ సురేష్ యడవల్లి మాట్లాడుతూ.. సరోవరం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్‌గా నడిచే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి మమ్మల్ని దీవించండని తెలిపారు.
జబర్దస్త్ నవీన్, రాము మాట్లాడుతూ.. సరోవరం సినిమా అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగింది. మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమేంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.
నటీనటులు:
విశాల్ వున్న
ప్రియాంక శర్మ
శ్రీలత
తనికెళ్ల భరణి
మేకా రామకృష్ణ
ఛత్రపతి శేఖర్
మహమ్మద్ ముస్తఫ
సంధ్య జనక్
మీనా కుమారి
జబర్దస్త్ నవీన్
జబర్దస్త్ రాము
సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: మలహార్ భట్ జోషి
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
సంగీతం: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు
ప్రొడ్యూసర్: ఎస్.శ్రీలత
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సురేష్ యడవల్లి