టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఒకట్రెండు సినిమాలు తప్ప ఆశించినంతగా హిట్ కాలేదు. దీంతో హీరోలకు ఫ్రెండ్‌గా, విలన్‌గా ఇలా కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. వాస్తవానికి నవదీప్‌కు సినిమాల్లో నటించాల్సిన అక్కర్లేదు.. ఆయన సినిమాపై పిచ్చితో నటిస్తున్నారే తప్ప.. ఆయన బ్యాగ్రౌండ్ వేరు. అయితే నవదీప్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగు చూశాయి.
అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నవదీప్.. బాగా బలిసినోడు.. డబ్బున్నోడు.. బలుపెక్కువ అని ఇలా పలురకాలు పుకార్లు వచ్చాయి. అంతేకాదు.. మరీ ముఖ్యంగా నవదీప్ ‘గే’ అని.. ఆయన అమ్మాయిల కంటే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారని అప్పట్లో పుకార్లు పెద్ద ఎత్తున వచ్చాయి. తాజాగా కూడా ఇవే పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లకు ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అసలు ఈ పుకార్లు చెలరేపిందెవరు..? గే అని ఎందుకన్నారు..? దీని వెనుకున్న అసలు విషయాలను బయపెట్టాడు.
తాను యూఎస్‌లో ఉండగా.. ఓ వ్యక్తి మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేనూ సేమ్ టూ సేమ్ అని చాటింగ్ చేయడం మొదలుపెట్టాడని.. అంతేకాదు.. మీతో మాట్లాడాలని ఉందని.. మీతో ఫీలింగ్స్ పంచుకోవాలని ఉందన్నాడని నవదీప్ చెప్పుకొచ్చాడు. ‘నాకు అబ్బాయిలు ఇష్టమా? అమ్మాయిలు ఇష్టమా? లేక మీకు ఎవరు ఇష్టమనేది పక్కనపెట్టండి.. మీరు ఎవరో నాకు తెలియదు. మీ ఫీలింగ్స్ నాకెందుకు చెబుతున్నారు. నాకు ఇంట్రస్ట్ లేదు. నీ ఫీలింగ్స్‌లో అని బై చెప్పి వాడికో దండం పెట్టేశా. చాటింగ్‌లో తప్ప డైరెక్ట్‌గా నన్ను ‘గే’ అన్నది ఎప్పుడూ లేదు. వాస్తవానికి గే అనే వాళ్ల లక్షణాలు వేరుగా ఉంటాయి. వారి పద్ధతులు, రకాలు వేరుగా ఉంటాయి. నేను ఆ కేటగిరికి సంబంధించిన వాడ్ని కాదు’ అని నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇకనైనా నవదీప్‌పై ఇలాంటి పుకార్లు ఆగుతాయో లేదో వేచి చూడాలి మరి.