Advertisementt

‘చీమ-ప్రేమ మధ్యలో భామ’లో బాలు పాట

Tue 15th Oct 2019 08:46 PM
cheema prema madhyalo bhama,movie,title,song,released  ‘చీమ-ప్రేమ మధ్యలో భామ’లో బాలు పాట
SP Balu sings song for Cheema Prema Madhyalo Bhama Movie ‘చీమ-ప్రేమ మధ్యలో భామ’లో బాలు పాట
Advertisement
Ads by CJ

‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ టైటిల్ సాంగ్ విడుదల

చీమేంటి ? ప్రేమేంటి ? మధ్యలో ఈ భామేంటి ? ఇదేo సినిమా టైటిల్ ? కొత్తగా ఉందే!  ‘‘ఔను , కొత్త వాళ్ళు కొత్తవాళ్లతో చేసే కొత్త ప్రయత్నం మరి కొత్తగానే ఉండాలి! ఉంటుంది!’’ అంటున్నదెవరో కాదు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు.

చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్  ప్రైవేట్ లిమిటెడ్  వారి సినిమాలో హీరో హీరోయిన్లు 2016 లో  మిస్టర్ ఇండియాగా (N), 2018 లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ  ఫైనలిస్ట్ కావడం ప్రత్యేక ఆకర్షణ. రాజమౌళి గారి ‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి దాయకం అన్నారు చిత్ర నిర్మాత లక్ష్మీనారాయణ!

అల్పప్రాణి చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా మధురాతి మధుర గాయకులు పద్మభూషణ్ శ్రీ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారు టైటిల్ సాంగ్ ‘చీమ-ప్రేమ మధ్యలో భామ!’ ను అద్భుతంగా ఆలపించారు. శ్రీ రవివర్మ గారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట- బాణీ పదికాలాలు అందరినీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం!

నటీనటులు:

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్ పి బాలసుబ్రమణ్యం, గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్, కోరియోగ్రఫీ : చిరంజీవి, సుభాష్, ఆనంద్. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

SP Balu sings song for Cheema Prema Madhyalo Bhama Movie:

Cheema Prema Madhyalo Bhama Movie Title Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ