Advertisementt

బర్త్‌డే స్పెషల్: న్యూ మూవీ ప్రకటించిన శివబాలాజీ

Tue 15th Oct 2019 07:15 PM
siva balaji,birthday celebrations,siva balaji hero,family members,new project  బర్త్‌డే స్పెషల్: న్యూ మూవీ ప్రకటించిన శివబాలాజీ
Birthday Special: Siva Balaji Announces His New Project బర్త్‌డే స్పెషల్: న్యూ మూవీ ప్రకటించిన శివబాలాజీ
Advertisement

ఘనంగా శివబాలాజీ పుట్టినరోజు వేడుకలు

కథకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటించి అందరి ప్రశంసలను అందుకున్న నటుడు శివబాలాజీ. ఆ తరువాత సొంత బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ ను స్థాపించి ‘స్నేహమేరా జీవితం’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఈ సంవత్సరం మా జాయింట్ సెక్రటరీ‌గా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 14 శివబాలాజీ పుట్టినరోజును తన సన్నిహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఘ‌నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 

ఈ సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ.. ‘‘మా బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’లో నిర్మించిన ‘స్నేహమేరాజీవితం’ చిత్రం.. నటుడిగా, నిర్మాతగా నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో మంచి కథతో మా బేన‌ర్‌లో సెకండ్ మూవీని స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్ మొద‌ల‌వుతుంది. అలాగే అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉండే ఒక వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నాను. మంచి కథ, కథనం ఉన్న సినిమాతోనే మీ ముందుకు రావాలని కొంచెం టైమ్ తీసుకోవడం జరిగింది. ఇకనుండి నటుడిగా, నిర్మాతగా ఇలా కంటిన్యూగా మీముందుకు రాబోతున్నాను. ఈ సంవత్సరం ‘మా’ అసోసియేషన్‌లో జాయింట్ సెక్రటరీగా నేను ఎన్నికవ్వడం మంచి పనులు చేయడానికి నాకొచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి’’ అన్నారు.

Birthday Special: Siva Balaji Announces His New Project :

Siva Balaji Celebrates His Birthday with Family Members

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement