Advertisementt

నాగశౌర్య మరో సినిమాకు క్లాప్ కొట్టారు

Tue 15th Oct 2019 04:44 PM
naga shourya,santhosh jagarlapudi,movie,launched  నాగశౌర్య మరో సినిమాకు క్లాప్ కొట్టారు
Naga Shourya and Santhosh Jagarlapudi Movie Launched నాగశౌర్య మరో సినిమాకు క్లాప్ కొట్టారు
Advertisement
Ads by CJ

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. చిత్రం ప్రారంభం.

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బేనర్స్‌పై నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజా  కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌ క్లాప్‌ నివ్వగా, సూపర్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి. ఈ సందర్భంగా..

ప్రముఖ నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ - ‘‘నార్త్‌ స్టార్‌ ఎంటర్టైన్మెంట్‌ ప్రై.లి, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి పై నారయణదాస్‌ నారంగ్‌, రామ్‌ మోహన్‌ రావు గార్లతో కలిసి నాగశౌర్య హీరోగా ఈ చిత్రం నిర్మిస్తున్నాను. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది  అలాగే సంతోష్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు.

యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘‘ఏషియన్‌ సునీల్‌ గారు. శరత్‌ మరార్‌ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం హ్యాపీగా ఉంది. సంతోష్‌ సెకండ్‌ ఫిలిమ్‌. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం ఒక స్పోర్ట్స్‌ డ్రామా. ఒక ఇమాజినరీ బయోపిక్‌లా ఉంటుంది. నాకు తప్పకుండా మైలేజ్‌ ఇచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమాలో మీరు సరికొత్త నాగశౌర్యని చూస్తారు’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ రెడ్డి మాట్లాడుతూ - ‘‘నేను నాగశౌర్య గారి ‘అశ్వద్ధామ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాను. ఈ సినిమాలో మళ్ళీ అవకాశం రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ : మనోజ్‌ రెడ్డి, నిర్మాతలు: నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌ రావు, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి.

Naga Shourya and Santhosh Jagarlapudi Movie Launched:

Naga Shourya New Movie Opening Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ