Advertisementt

మహేష్, బన్నీ.. ఇప్పుడు చిరు! ఇదైనా ఉంటుందా?

Mon 14th Oct 2019 07:21 PM
ram charan,chiranjeevi,sukumar,lucifer movie,remake,allu arjun,mahesh babu  మహేష్, బన్నీ.. ఇప్పుడు చిరు! ఇదైనా ఉంటుందా?
Sukumar Next Film with Mega Star Chiranjeevi మహేష్, బన్నీ.. ఇప్పుడు చిరు! ఇదైనా ఉంటుందా?
Advertisement
Ads by CJ

రంగస్థలం సినిమా వచ్చి అపుడే ఏడాదిన్నర గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కలేదు. మహేష్‌తో చెయ్యాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వగానే అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయిన సుకుమార్.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకపోతున్నాడు. అల్లు అర్జున్‌ని స్క్రిప్ట్ తో మెప్పించలేక మీనమేషాలు లెక్కెడుతున్నాడు. అసలైతే ఈ దసరాకి బన్నీ - సుకుమార్ ల సినిమా మొదలవ్వాల్సింది. కానీ... లేదు. ఇక ఈ సినిమాకే దిక్కులేదు. తాజాగా సుకుమార్ మరో సినిమా ఫైనల్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్ బయటికి వచ్చింది.

సైరాతో హిట్ అందుకుని... కొరటాలతో తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు 152 కోసం పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిరంజీవితో సుకుమార్ చేస్తున్నట్లుగా ఆ వార్తల్లోని సారాంశం. చిరు 153ను సుకుమార్ దర్శకత్వంలో చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. రామ్ చరణ్‌తో ఉన్న స్నేహంతోనే చిరు సినిమా దర్శకత్వాన్ని సుకుమార్ అందుకోగలిగాడని అంటున్నారు. అయితే చిరు - సుకుమార్ ల చిత్రం ఓ మలయాళ రీమేక్‌గా తెలుస్తుంది. అది కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ అంటూ ప్రచారం మొదలైంది. మరి బన్నీ చిత్రాన్ని త్వరగా ఫినిష్ చేసి... సుకుమార్ చిరుతో సినిమా మొదలెడతాడట. మరి ఈలోపు చిరు కూడా కొరటాల సినిమా ఫినిష్ చేసి సుకుమార్ కోసం రెడీ అవుతాడని అంటున్నారు. చూద్దాం.. ఈ సినిమా అయినా సుక్కు కన్ఫర్మ్‌గా చేస్తాడో.. లేదంటే ఇది కూడా గాసిప్పే అవుతుందో..!

Sukumar Next Film with Mega Star Chiranjeevi:

Sukumar Remakes Lucifer with Chiranjeevi in the Ram Charan Production

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ