Advertisementt

ఒరేయ్ బుజ్జిగా మూవీ అప్డేట్ ఇదే

Sun 13th Oct 2019 01:03 PM
orei bujjigaa,movie,second,schedule,update  ఒరేయ్ బుజ్జిగా మూవీ అప్డేట్ ఇదే
Orei bujjigaa movie latest update ఒరేయ్ బుజ్జిగా మూవీ అప్డేట్ ఇదే
Advertisement
Ads by CJ

రెండో షెడ్యూల్‌లో రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ల ‘ఒరేయ్‌.. బుజ్జిగా’

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ... ‘‘ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌గారు మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్‌గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Orei bujjigaa movie latest update:

Orei bujjigaa movie in second schedule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ