RX 100 సినిమాలో నెగెటివ్ రోల్ లో బోల్డ్ గా నటించి యూత్ గుండెల్లో సెగలు రేపిన పాయల్ రాజపుత్ మళ్ళీ అలాంటి బోల్డ్ పాత్రలు చెయ్యనంటూనే.. RDX లవ్ సినిమా చేసింది. ఈ సినిమా మొత్తం పాయల్ రాజపుత్ గ్లామర్ నే వాడుకుంది. సినిమా ప్రమోషన్స్ లోను పాయల్ అందాలనే ఎరగా వేసింది సినిమా యూనిట్. టీజర్ ని మితిమీరిన శృంగార కంటెంట్ తో కట్ చేసిన RDX టీం... తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ట్రైలర్ ని సామాజిక అంశాలతో కనెక్ట్ అయ్యేలా పాయల్ రాజపుత్ హీరోయిజాన్ని చూపించారు. ఇక టీజర్ బోల్డ్ గా ఉంటే... ట్రైలర్ మాత్రం కాస్త పద్దతిగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో అనుకుంటే... సినిమాలో పాయల్ అందాలు తప్ప చూడడానికి మరేదీ లేదు.
శృంగారానికి, సామజిక అంశాలకు ముడిపెట్టి... సినిమాని నడిపించేదామనుకున్న దర్శకుడుకి ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. పాయల్ రాజపుత్ అందాలు, గ్లామరసం తప్ప కథ, కథనం, దర్శకత్వం, ఎడిటింగ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే అన్ని పరమ బోటింగ్. కామెడీ కానీ, ఎమోషనల్ గా కానీ సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వదు. మరి RX 100 లో పాయల్ నెగెటివ్ బోల్డ్ నటనను అడ్డం పెట్టుకుని... RDX లోను ఆమె అందాలను ఎరగా వేసి సినిమా హిట్ కొట్టాలని దర్శకుడు అనుకున్నాడు. కానీ RDX లవ్ మాత్రం RX 100 పేలినట్టుగా పేలలేదు సరికదా... తుస్ మంది.