Advertisement

రాజుగారిగది 3 హీరో అశ్విన్ ఇంటర్వ్యూ

Sat 12th Oct 2019 08:33 PM
ashwin,hero,raju gari gadhi 3,movie,interview  రాజుగారిగది 3 హీరో అశ్విన్ ఇంటర్వ్యూ
Raju Gari Gadhi 3 Hero Ashwin Interview రాజుగారిగది 3 హీరో అశ్విన్ ఇంటర్వ్యూ
Advertisement

రాజుగారిగది 3 హీరో అశ్విన్ ఇంటర్వ్యూ..

1. రాజుగారిగది 3 ఎలా వచ్చింది..?

రాజుగారిగది అనే సినిమా చేసినపుడు 2,3 చేస్తామని అనుకోలేదు. ప్రేక్షక దేవుళ్లు ఆదరించారు. అప్పుడు పార్ట్ 2కు నాగార్జున, సమంత గారి సపోర్ట్ వచ్చింది. నేను కూడా అందులో భాగం కావడం అదృష్టం. పార్ట్ 2లో ఎంటర్‌టైన్మెంట్ తగ్గింది అన్నారు. అందుకే ఇప్పుడు పార్ట్ 3 వస్తుంది. ఇందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం.

2. ఒకే సబ్జెక్ట్ మీద చేస్తుంటే బోర్ కొట్టదా..?

ఒకే సబ్జెక్ట్ మీద కాదు.. ప్రతీ సినిమాలోనూ కథలు ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టే సినిమాలు ఆదరిస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్ట్ 3.. ఇది సక్సెస్ అయితే 4 కూడా వస్తుందేమో చెప్పలేం.  

3. మూడో భాగం కేవలం కామెడీ కోసమే చేసారా..?

కాదండి.. కామెడీ కాదు.. హార్రర్ కామెడీ. అది కూడా రెండో భాగంలో నాగార్జున, సమంత లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి ఎంటర్‌టైన్మెంట్ తగ్గిందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే మూడో భాగం కేవలం హార్రర్ కామెడీ కోసమే చేసాం.

4. ఇందులో ఎవరెవరు ఉన్నారు..?

మూడో భాగం చాలా ఫన్నీగా ఉంటుంది. ఇందులో సీనియర్ యాక్టర్స్ అలీ, బ్రహ్మాజీ, ఊర్వశమ్మ లాంటి వాళ్లు ఉన్నారు. రెండో భాగం అంటే కథకు తగ్గట్లుగా నాగార్జున, సమంత గారు వచ్చారు. ఇప్పుడు కథకు తగ్గట్లుగా నార్మల్‌గా వచ్చాం. కథ బాగుంది కాబట్టే స్టార్స్ లేకపోయినా రాజుగారిగది 1 రీచ్ అయింది.

5. ఆడియన్స్‌కు నచ్చేలా ఏముంటాయి సినిమాలో..?

ఆడియన్స్ కు నచ్చేలా చెప్పాలంటే.. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో హార్రర్ సీన్స్ వచ్చినప్పుడు అక్కడ భయాన్ని వాళ్లు నవ్వుగా మలుచుకుని ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు నాకు కూడా మాస్ కారెక్టర్ పడింది. ఈ సినిమాలో ఆడియన్స్‌కు నా తరఫు నుంచి మాటిచ్చేది ఏంటంటే.. పార్ట్ 1,2 లో ఉన్న ఎంటర్‌టైన్మెంట్ కంటే ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలీ, బ్రహ్మాజీ, ఊర్వశమ్మ, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తారు. రాజుగారిగది 3 ఫుల్ ఎంటర్ టైనర్.

6. ఛోటా కే నాయుడు ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాడు..?

అయ్యో.. ఆయన చాలా పెద్ద టెక్నీషియన్.. మా సినిమాకు ఆయన చాలా ప్లస్ అవుతాడు. జూన్‌లో సినిమా మొదలు పెట్టి అక్టోబర్ 18న విడుదలకు వస్తున్నామంటే దానికి కారణం ఆయనే. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ ఛోటా కే నాయుడు అన్న. ఈ సినిమా ఆయనకు ఓ ఛాలెంజ్. ఇప్పటి వరకు ఆయన ఈ జోనర్ చేయలేదు. అంజి సోషియో ఫాంటసీ చేసాడు కానీ హార్రర్ కామెడీ చేయలేదు. డిఓపి వర్క్ గురించి సినిమా విడుదలైన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడతారు.

7. నటుడిగా ఈ సినిమా మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది..?

యాక్టర్‌గా ఇప్పటి వరకు నన్ను గుర్తు పెట్టుకునే పాత్రలు అయితే చేయలేదు. రాజుగారిగది 1లో అస్సలు నేను మాట్లాడను.. రెండో పార్ట్‌లో నేను భయపడుతూ మెంటలిస్ట్‌ను కలుస్తాను. అప్పుడు నాగార్జున గారు వస్తారు. ఇక ఇప్పుడు పార్ట్ 3లో ఫుల్ లెంత్ మాస్ కారెక్టర్ చేస్తున్నాను. నా కారెక్టర్ పక్కా మాస్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఉంటుందనే ఆశిస్తున్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటారు అని వేచి చూస్తున్నాను. పాటలు, డాన్సులు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ చేసాను. మాస్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ కారెక్టర్‌లో ఉంటాయి. అందుకే నేను కూడా అక్టోబర్ 18 కోసం వేచి చూస్తున్నాను.

8. తొలి రెండు పార్ట్స్ సోషల్ మెసేజ్ ఇచ్చారు.. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నారా..?

లేదండీ.. ఈ సారి మెసేజ్ లేదు. హాయిగా థియేటర్స్‌కు వచ్చి 2 గంటలు నవ్వుకుని వెళ్లండి అనేది ఈ సినిమాతో మేం ఇస్తున్న మెసేజ్. తొలి భాగంలో థ్రిల్ కలిగించే మెడికల్ మాఫియా.. రెండో భాగంలో లేడీస్ ఇగో బయట వాళ్ల గురించి సొసైటీ ఎలా ఆలోచిస్తుంది అనేది చూపించాం. ఇప్పుడు అలా కాదు.. ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పక్కా మేటర్ సినిమా రాజుగారిగది 3.

9. అవికా గోర్ గురించి చెప్పండి.. తమన్నా ఎందుకు తప్పుకుంది..?

ముందు ఈ సినిమాను తమన్నా గారితోనే మొదలు పెట్టాం. ఓపెనింగ్ కూడా అయింది. అయితే ఆమె డేట్స్ కారణంగా తప్పుకున్నారు. అప్పటికే రెండు షెడ్యూల్స్ లేట్ అయ్యాయి కూడా. అక్టోబర్ విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా గారి కోసం వేచి చూస్తే బాగోదని వదిలేసుకున్నాం. ఆమె లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి కోసం చూసాం కానీ వాళ్ల డేట్స్ కూడా కుదర్లేదు. అలాంటి సమయంలో అవికా గోర్ వచ్చింది. ఆమె సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. అవికా గోర్ ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. కచ్చితంగా అలరిస్తుంది ఆమె కారెక్టర్.

10. సినిమాలో మీ కారెక్టర్ ఎలా ఉంటుంది..?

నా కారెక్టర్ పక్కా మాస్. నా పాత్ర కోసం నేను పూర్తిగా దర్శకుడిని ఫాలో అవుతాను. తొలి రెండు భాగాల్లో అదే చేసాను. ఇప్పుడు కూడా ఇదే చేసాను. అయితే మాస్ కారెక్టర్ కాబట్టి మనకు తెలియకుండానే మాస్ రాజా రవితేజ, చిరంజీవి, రజినీకాంత్ వాళ్లను ఫాలో అవ్వాలి. సాంగ్స్ చేసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ల వల్లే కదా నేను ఈ రోజు ఈ వైపు వచ్చాను.

11. సినిమా పాయింట్ ఎలా ఉండబోతుంది..?

సినిమా అంతా చెప్పేయమంటారా (నవ్వుతూ).. వారం రోజులు ఆగండి గురువుగారు.. అప్పుడు చూద్దాం కానీ.. అక్టోబర్ 18 వరకు ఓపిక పట్టండి.

12. మీ కెరీర్ గురించి చెప్పండి..

నా కెరీర్ 2012లో స్టార్ట్ అయింది. జీనియస్ సినిమాకు మెయిన్ లీడ్ చేసాను. ఆ విషయం ఇక్కడ ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు. ఆ సినిమా అప్పుడు హీరోలను చూపించకూడదు అనే సరికి షూటింగ్ అయ్యేంతవరకు మేం బయటికి రాలేదు. ఆ తర్వాత సినిమా కష్టాలు పడ్డాను. అల్లు అరవింద్, బి గోపాల్ లాంటి వాళ్లు నా ఫస్ట్ సినిమా అప్పుడు వచ్చారు. అక్కడ్నుంచి నా జర్నీ మొదలైంది. ఏ సినిమా ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నాను. రాజుగారిగది బ్లాక్ బస్టర్ అయింది. కానీ అప్పుడు నాకు పేరు రాలేదు. అది టెక్నీషియన్స్ హిట్. ఆ తర్వాత జతకలిసే సినిమాలో లవర్ బాయ్ కారెక్టర్ చేసాను. తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు రాజుగారిగది 3 చేసాను. మాస్ కమర్షియల్ సినిమా ఇది. డాన్స్, ఫైట్స్, యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న పాత్ర ఇది. అందుకే వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 18.

13. మీ కారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో.. ముందు పార్ట్స్ మాదిరే భయపడుతూ ఉంటారా..?

లేదండీ.. పార్ట్ 1లో నేను అస్సలు భయపడను. అందులో నాది ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ టైప్ ఆఫ్ కారెక్టర్. ఎప్పుడైనా మాట్లాడితే బాగున్ను అనుకుంటారు ఆడియన్స్. పార్ట్ 3 కథ గురించి ఏం చెప్పాలన్నా కూడా సినిమాతో లింక్ అయి ఉంటుంది. సో అప్పటి వరకు ఆగండి.

14. పార్ట్ 4 వస్తుందా..?

ప్రస్తుతానికి అయితే ఐడియా లేదు. రెండో భాగంలో రీమేక్ చేసాం. పాయింట్ ఇన్ స్పైర్ అయ్యాం. ఇప్పుడు కూడా ఓ పాయింట్ తీసుకుని చేసాం. కచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు ఆడియన్స్.

15. నిర్మాతగా చేస్తారా.. ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?

OAK ప్రొడక్షన్స్‌లో నేను కూడా ఓ మెంబర్. అందులో ఏ అంటే అశ్విన్ బాబు. కచ్చితంగా నాకు నిర్మాత కష్టాలు తెలుసు. నా దగ్గరికి వచ్చిన కథలు చూసి నిర్మాతలకు ఓ రూపాయి లాభం వచ్చేలా ఉంటాను. ఇప్పుడు నాకు మార్కెట్ లేదు. కానీ రేపు వచ్చిన తర్వాత కూడా కచ్చితంగా నిర్మాతకు మిగిలేలా జాగ్రత్త పడతాను. సపోజ్ నాకు 5 కోట్లు మార్కెట్ ఉంటే 3 కోట్లలో సినిమా చేయాలి. ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ కష్టాలు నాకు తెలుసు.

16. నెక్ట్స్ సినిమాలు ఏంటి..?

మూడు నాలుగు కథలు ఉన్నాయి. ముందు అయితే గోదా అనే మళయాల సబ్జెక్ట్ విన్నాను. ఏడాదిన్నరగా అందరి హీరోల దగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఛోటా కే నాయుడు అన్న, ఓంకార్ గారు విని ఆ తర్వాత నాకు చెప్తానని చెప్పారు.

Raju Gari Gadhi 3 Hero Ashwin Interview:

Hero Ashwin Talks About Raju Gari Gadhi 3 Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement