Advertisementt

తిప్పరామీసం రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది

Sat 12th Oct 2019 08:13 PM
sree vishnu,tippara meesam,release,november 8  తిప్పరామీసం రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది
Tippara Meesam Release Date Fixed తిప్పరామీసం రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది
Advertisement
Ads by CJ

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తిప్పరామీసం సినిమా విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ యాక్షన్ డ్రామాను ఎల్ కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. అతి త్వరలోనే ట్రైలర్.. ఆడియో విడుదల వేడుక కూడా జరగనున్నాయి. తిప్పరామీసం తెలుగు రాష్ట్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: కృష్ణ విజయ్ L

బ్యానర్స్: రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా

సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత రామారావు

ఎగ్జ్యిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్: మనోజ్ మావిళ్ళ

సంగీతం: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: సిధ్

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

ఆర్ట్ డైరెక్టర్: షర్మిల యెలిశెట్టి

లిరిక్స్: పూర్ణాచారి, అల రాజా

ఛీఫ్ కో డైరెక్టర్: రామకృష్ణ పొన్నబోయిన

క్రియేటివ్ హెడ్: విజయేంద్ర మండ్ల

క్యాస్ట్యూమ్ డిజైనర్: శశి కిరణ్ కోసూరి

ఫైట్స్: రామకృష్ణ, రియల్ సతీష్

కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, పోలాకీ విజయ్

పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను

PRO: వంశీ శేఖర్

Tippara Meesam Release Date Fixed:

Tippara Meesam Release on November 8th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ