నిన్న సోషల్ మీడియాలో చిరు - బాలయ్య కు సంబంధించి ఫొటోస్ కొన్ని వైరల్ అవుతూ వచ్చాయి. సుబ్బరామిరెడ్డి ఇచ్చిన సైరా ఫంక్షన్‌కి బాలయ్య, వెంకటేష్ కూడా వచ్చారు అని బాలయ్యది పెద్ద మనసు అని..నాగబాబు అలా అప్పట్లో క్రిటిసైజ్ చేసినా బాలయ్య పట్టించుకోలేదని.. సైరాను ప్రమోట్ చేయడానికి వచ్చాడు అని తెగ మెచ్చుకున్నారు.
కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అక్కడ అంత సీన్ లేదు. అసలు సైరా ఫంక్షన్‌కి బాలయ్య, వెంకటేష్ రాలేదు. అసలు ఏం జరిగిందంటే.. సైరాకు సుబ్బరామి రెడ్డి అభినందన సభ పార్క్ హయాత్ హోటల్ లో జరిగింది. ఇంతవరకు నిజమే. కానీ అక్కడే పై ఫ్లోర్ లో ఓ సినిమా డైరక్టర్ ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది. దానికి చిరు, బాలయ్య, వెంకటేష్ హాజరయ్యారు. అంతే తప్ప సైరా ఫంక్షన్ కి బాలయ్య రాలేదు. అటువంటిది ఏమి జరగలేదు. కాకపోతే ఆ డైరెక్టర్ ఫంక్షన్ కి వచ్చిన బాలయ్య అండ్ చిరు కాసేపు ముట్టడించుకున్నట్లు తెలుస్తుంది.