అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ అయ్యే ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. పలు భాషల్లో డబ్ అయిన ఈ సిరీస్ త్వరలోనే రెండో సీజన్ స్టార్ట్ కానుంది. తెలుగువారికి పరిచయం వున్న మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ లాంటి నటులు వున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ రూపకర్తలు డికె అండ్ రాజ్ కూడా తెలుగువారికి పరిచయం వున్నవారే.
ఫస్ట్ సీజన్‌ను కంప్లీట్ చేసుకుని రెండు సీజన్‌లోకి త్వరలోనే అడుగు పెట్టనుంది. మొదటి సీజన్‌కి వచ్చిన రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. పాక్ - ఇండియా వ్యవహారాలు, కాశ్మీర్, టెర్రరిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మొదటి సీజన్‌లో 10 భాగాలు అందించారు. ఇప్పుడు రెండో సీజన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే టెలికాస్ట్ అవ్వనుంది.
ఇక రెండో సీజన్‌లో సమంత కూడా నటించిందని అందరికి తెలిసిందే. ఇందులో సామ్ ఎన్నడూ చేయని విధంగా నెగటివ్ రోల్ లో కనిపించనుంది. టెర్రరిస్ట్‌గా కనిపించబోతోంది. మరి దీన్ని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.