Advertisementt

బిగ్ బాస్ 3: ఫైనల్లో ఉండేది వీరేనా..!

Sat 12th Oct 2019 08:47 AM
nagarjuna,bigg boss 3,finalists list,latest,update  బిగ్ బాస్ 3: ఫైనల్లో ఉండేది వీరేనా..!
Bigg Boss 3 Latest Update బిగ్ బాస్ 3: ఫైనల్లో ఉండేది వీరేనా..!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఫైనల్ దగ్గర పడుతుంది. సరిగా మూడు వారాలు మాత్రమే ఉంది. సో దాంతో అసలు హౌస్ లో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఫైనల్ కి వెళ్తారు అని ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే తాజాగా షో పట్ల జనాల్లో ఉన్న ఫీడ్ బ్యాక్, ట్రెండ్స్ ప్రకారం చూస్తే వచ్చే మూడు వారాల్లో ఇద్దరు మగాళ్లు, ఓ అమ్మాయి బయటికి వెళ్లే అవకాశముందని ఓటింగ్స్ ప్రకారం అర్ధం అవుతుంది.

ఈవారం మహేష్, రాహుల్, వరుణ్ నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు షోలో కొనసాగడమే ఎక్కువ అనే అభిప్రాయం కలిగించిన మహేష్ ఈవారం ఎలిమినేట్ అవ్వనున్నాడని ఓటింగ్స్ ద్వారా అర్ధం అయిపోతుంది. ఇక వచ్చే రెండు వారాల్లో అలీ రజా ఎలిమినేట్ కావచ్చు. రీఎంట్రీ ద్వారా వచ్చినా అలీకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఫాలోయింగ్ బాగా తగ్గింది. సో అలీ నెక్స్ట్ వచ్చే రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అర్ధం అయిపోతుంది.

ఇక హౌస్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఒక్కరు కచ్చితంగా ఏదొక వీక్ ఎలిమినేట్ అవుతారు అని తెలుస్తుంది. శ్రీముఖి ఫైనల్ కు చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఇక శివజ్యోతి, వితికల్లో.. వితిక ఎలిమినేట్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే భార్యాభర్తలిద్దరినీ ఫైనల్‌కు పంపడం బాగుండదని, అందుకే ఆమెను బయటకు పంపే అవకాశముందని తెలుస్తుంది. సో ఫైనల్ గా ఫైనల్ కి వెళ్ళేది వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, శివజ్యోతి. మరి ఈ  ఐదుగురిలో ఎవరు టైటిల్ విన్ అవుతారో చూడాలి.

Bigg Boss 3 Latest Update:

Bigg Boss 3: This is the Finalists list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ