Advertisementt

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10వ మూవీ మొదలైంది

Fri 11th Oct 2019 12:06 PM
mega prince,varun tej,10th movie,launch,details  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10వ మూవీ మొదలైంది
Mega Prince Varun Tej 10th Movie Launched మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10వ మూవీ మొదలైంది
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన కొత్త చిత్రం

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌. ఈ ఏడాది ‘ఎఫ్ 2’, ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ చిత్రాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా గురువారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభ‌మైంది.

ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నాగ‌బాబు క్లాప్ కొట్ట‌గా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అర‌వింద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అల్లు అర‌వింద్‌, అల్లు బాబీ, సిద్ధు ముద్ద క‌లిసి హీరో వ‌రుణ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కిరణ్ కొర్ర‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్రపాటి మాట్లాడుతూ - ‘‘అల్లు అరవింద్‌గారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ప్రాధాన్య‌త‌నిచ్చే వ‌రుణ్ తేజ్‌గారు క‌థ విన‌గానే వెంట‌నే ఓకే చెప్పారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకుని వ‌రుణ్‌గారు చాలా మేకోవ‌ర్ అయ్యారు. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం, జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. సినిమాలోని మిగ‌తా న‌టీనటులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

సాంకేతిక వ‌ర్గం:

సినిమాటోగ్ర‌ఫీ:  జార్జ్ సి.విలియ‌మ్స్‌

మ్యూజిక్‌:  త‌మ‌న్‌.ఎస్‌

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

నిర్మాత‌లు:  సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్‌

ద‌ర్శ‌క‌త్వం:  కిర‌ణ్ కొర్ర‌పాటి

Mega Prince Varun Tej 10th Movie Launched:

Varun Tej 10th Film Launch Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ