2020 సంక్రాంతికి టాలీవుడ్ నుండి ముఖ్యంగా రెండు పెద్ద సినిమాలు బరిలో నిలవబోతున్నాయి. సూపర్ స్టార్ క్రేజ్ ఉన్న మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు మాత్రం పక్కాగా సంక్రాంతికే రెడీ అవుతున్నాయి. మహేష్, అల్లు అర్జున్ సినిమాల మీద ట్రేడ్‌లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన ఆసక్తి ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలయ్యాయి. మహేష్ లుక్స్ తోనూ, మోషన్ పోస్టర్‌తో దడదడలాడిస్తే... అల కి అద్భుతమైన సాంగ్ అనేకన్నా బ్లాక్ బస్టర్ సాంగ్‌తో అంచనాలు లేపారు.
అయితే అల వైకుంఠపురములో సినిమా, సరిలేరు నీకెవ్వరు సినిమాల విడుదల డేట్స్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ ఇవ్వడం లేదు. ఎవరు ముందు ఎవరు వెనక, లేదంటే ఇద్దరూ ఒకే రోజా.. అనే విషయంలో పూర్తి కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. అల వైకుంఠపురంలో జనవరి 12న పక్కా.. పోస్టర్ కూడా ఇచ్చారు. కానీ మహేష్ సరిలేరు కే డేట్ ఇవ్వడం లేదు. సంక్రాంతి సెలవలకి రెండు సినిమాలు ఓకే రోజు అయినా.... రెండు రోజుల తేడాతో విడుదలైన మంచి కలెక్షన్స్ కొడతాయి. కాకపోతే ఆ కలెక్షన్స్ టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక ఓ సినిమాకి దిల్ రాజు, మరోదానికి అరవింద్ లు నిర్మాతలు కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరికీ ఎక్కువ థియేటర్స్ దక్కుతాయో అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క బయ్యర్లు కూడా రెండు పెద్ద సినిమాలు ఓ నాలుగు రోజుల తేడాతో విడుదలైతే బావుండు... సినిమాలకు నెగెటివ్ టాకొచ్చినా సేఫ్ అవుతాం అంటున్నారు.