Advertisementt

‘RDX ల‌వ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విశేషాలివే!

Thu 10th Oct 2019 06:46 PM
celebrities,speech,rdx love,pre release,event  ‘RDX ల‌వ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విశేషాలివే!
RDX Love Pre Release Event Highlights ‘RDX ల‌వ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విశేషాలివే!
Advertisement

‘RDX ల‌వ్’ ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం ‘RDX ల‌వ్’. అక్టోబ‌ర్ 11న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోగా మారిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం ...

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ‘‘ఇవాళ చాలా కొత్త‌గా ఉంది. హీరోగా నా సినిమా ప్రారంభ‌మైంది. నేను ఆర్.నారాయ‌ణ‌మూర్తి గారికి క‌నిపించిన‌ప్పుడ‌ల్లా ‘నువ్వు హీరోగా చెయ్యి బాసూ!’ అనేవాడు. నేను కూడా మొహ‌మాటానికి చేస్తానని చెప్పేవాడిని. నిజంగా త‌థాస్తు దేవతలు ఉన్నారేమో అదే నిజ‌మైంది. ఈ వేదిక‌గా ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.  RDX ల‌వ్ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. పాయ‌ల్ రాజ్‌పుత్ స‌హా ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు. రామ్ ప్ర‌సాద్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా చేశాడు. నా తొలి సినిమా ఆదికి కూడా ఆయ‌నే కెమెరామెన్‌. పోస్ట‌ర్స్ చూస్తుంటేనే చాలా కొత్త‌గా ఉంది. RDX ల‌వ్ సినిమాను RX 100 అంత హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

పాయ‌ల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ - ‘‘చాలా హ్యాపీగా ఉంది. కొత్త మూవీ ‘RDX ల‌వ్’ విడుద‌ల‌వుతుంది. ప్రేక్ష‌కులు నాకు ఎంతో ప్రేమాభిమానాల‌ను ఇస్తున్నారు. ఆర్.ఎక్స్ 100 మూవీ నా లైఫ్‌ను మార్చేసింది. ఈ స‌క్సెస్ సాధించ‌డానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఆ క‌ష్ట‌మే నన్ను టాప్ టెన్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా నిల‌బెట్టింది. భాను శంక‌ర్‌గారు చెప్పిన క‌థ న‌చ్చింది. ఈ సినిమాలో చాలా విష‌యాల‌ను ట‌చ్ చేశాం. 45 రోజుల వ‌ర‌కు పాపి కొండ‌ల్లో షూట్ చేశాం. మంచి టాలెంట్ ఉన్య వ్య‌క్తుల‌తో ప‌నిచేశాను. నా కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్ దొరికినందుకు న‌టిగా చాలా సంతోషంగా ఉంది. భానుగారు నాపై న‌మ్మ‌కంతో ఇలాంటి ఓ క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు ఆయ‌న‌కు థ్యాంక్స్‌. అలాగే సి.క‌ల్యాణ్‌ గారికి థ్యాంక్స్‌. రామ్‌ప్ర‌సాద్ న‌న్ను అందంగా చూపించారు. అలాగే ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నాగారికి థ్యాంక్స్‌. తేజ‌స్‌కి థ్యాంక్స్‌. స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఇలాంటి మంచి ప్రాజెక్ట్ రావాలంటే మంచి టీమ్ కావాలి. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రినీ వెతికి సినిమాలో భాగం చేశాను. అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానుంది. తేజ‌స్‌.. క‌థ విని వెంట‌నే సినిమా చేశాడు. ఈ సినిమా పుట్ట‌డానికి కార‌ణం స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌వీణ్‌లే. శంకర్ భాను క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ముందుగా దీనికి ట్రిపుల్ ఎక్స్ ల‌వ్ అనే టైటిల్ అనుకున్నాను. ఎక్స్‌పోజింగ్‌ను బేస్ చేసుకుని ర‌న్ అయ్యే సినిమా కాదిది. రేపు సినిమా చూస్తే అస‌లు క‌థేంటో తెలుస్తుంది. పాయల్ రాజ్‌పుత్ చాలా గొప్ప‌గా న‌టించింది. రేపు లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకోగానే పాయ‌ల్ రాజ్‌పుత్ మైండ్‌లోకి వ‌స్తుంది. ర‌ధ‌న్ మంచి సంగీతం ఇచ్చాడు. కెమెరామెన్ రామ్‌ప్ర‌సాద్ కోసం సినిమాను రెండు నెల‌లు ఆపి.. స్టార్ట్ చేశాం. 68 రోజుల పాటు సినిమాను షూట్ చేశాం. న‌రేష్‌, తుల‌సి అద్భుతంగా నటించారు. ఫైర్ బ్రాండ్‌లాంటి సినిమా కోసం చాలా మంది క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా కోసం త్రీ వెర్ష‌న్స్ రీ రికార్డింగ్ చేశాం. డైరెక్ట‌ర్‌కి ఏదీ కావాలో దాన్ని స‌మ‌కూర్చాను. ఈ సినిమా కోసం ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ ప్రాణం పెట్టి ప‌నిచేశారు. కామ‌న్ ప‌బ్లిక్ స‌మ‌స్య‌ల‌ను లింక్ చేస్తూ చేసిన సినిమా ఇది. శంక‌ర్ భానుకి ఈ సినిమా చాలా పెద్ద స‌క్సెస్ కావాలి. మునీష్‌ చాలా మంచి నిర్మాత‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. సినిమా బాగా వ‌చ్చింది. సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్ట‌ర్ శంక‌ర్ భాను మాట్లాడుతూ - ‘‘సినిమా ఔట్‌పుట్ చూసిన త‌ర్వాత దీన్ని నేనే డైరెక్ట్ చేశానా? అనిపిస్తుంది. అంత అద్భుతంగా వ‌చ్చింది. అందుకు కార‌ణం సి.క‌ల్యాణ్‌గారు. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ఎక్స్‌ట్రార్డిన‌రీ టీమ్‌ను ఇచ్చారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్న‌గారు, కెమెరామెన్ రామ్‌ప్ర‌సాద్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ధ‌న్‌, సి.వి.రావుగారికి, స‌త్యానారాయ‌ణ‌రెడ్డిగారికి థ్యాంక్స్‌. అంద‌రూ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఇక ఆర్టిస్టుల ప‌రంగా చూస్తే పాయ‌ల్ రాజ్‌పుత్ గురించే ముందుగా చెప్పాలి. ఆమెకు క‌థ చెప్ప‌డానికి వెళ్లి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ చెప్ప‌గానే గెట్ అవుట్ అంది. ఇలాంటి ఓ క్యారెక్ట‌ర్స్ చేయ‌డానికి చాలా డేర్ కావాలి. అలాంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌ను త‌ను చేసింది. క‌థ‌, మ‌మ్మ‌ల్ని న‌మ్మి ఇలాంటి ఎమోష‌న‌ల్ మూవీలో న‌టించింది. క‌థ‌లో త‌న పాత్ర‌ను అర్థం చేసుకుని అద్భుతంగా న‌టించాడు. సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే కార‌ణం.. ఆ క్రెడిట్ క‌ల్యాణ్‌గారికే ద‌క్కుతుంది. టీజ‌ర్‌ను చూసి చాలా మంది నాకు మెసేజ్‌లు పంపారు. ర‌క ర‌కాలుగా మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ తీయ‌లేని సినిమా. తీయ‌బోని సినిమా. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన క‌ల్యాణ్‌గారికి, రామ్ మునీష్‌ గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.

హీరో తేజ‌స్ కంచ‌ర్ల మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా రూపొంద‌డానికి ప్ర‌ధాన కార‌ణం సి.క‌ల్యాణ్‌గారు. అలాగే ఈ సినిమాకు అస‌లు హీరో పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆమెకు స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఇంత భారీ సినిమా చేయ‌డానికి కార‌ణం డ‌బ్బే కాదు.. ప్రోత్సాహం, మంచి టీమ్‌ను ఇచ్చారు. భాను శంక‌ర్‌గారు ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. ఆయ‌న ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. మా కెమెరామెన్ రాంప్ర‌సాద్‌గారు ప్ర‌తి సీన్‌ను అందంగా చూపించారు. అలాగే చిన్నాగారు మంచి ఆర్ట్ వ‌ర్క్ ఇచ్చారు. భాస్క‌ర‌భ‌ట్ల‌ గారికి, ప‌రుశురాం, భానుగారికి థ్యాంక్స్‌. పాయ‌ల్‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీ. ఆమె చాలా ప్రొఫెష‌న‌ల్’’ అన్నారు.  

డా.వి.కె.న‌రేశ్ మాట్లాడుతూ - ‘‘RDX ల‌వ్’ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాస్ అవుతుంది. అద్భుత‌మైన కంటెంట్ ఉన్న సినిమా. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. పాయ‌ల్ రాజ్‌పుత్ సినిమాకు హీరో. త‌ను సినిమాను గ్రేట్ ఎఫ‌ర్ట్స్‌తో క్యారీ చేసింది. అలాగే తేజ‌స్‌కు అభినంద‌న‌లు. క‌ల్యాణ్‌గారు అద్భుతంగా నిర్మించారు. అలాగే డైరెక్ట‌ర్ శంక‌ర్‌భాను గారు తెర‌కెక్కించిన తీరు ప్ర‌శంస‌నీయం. చాలా మంచి రోల్ చేశాను. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ నచ్చుతుంది’’ అన్నారు.

తుల‌సి మాట్లాడుతూ - ‘‘డైరెక్ట‌ర్ భానుగారు అద్భుత‌మైన క‌థ‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమాతో ఆయ‌న బెస్ట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంటాడు. రామ్‌ప్ర‌సాద్‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ విజువ‌ల్స్ అందించారు. రధ‌న్ సంగీతం, చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌, ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్‌.. ఇలా మంచి టీమ్‌గా ప‌నిచేశాం. సినిమా త‌ప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’  అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ రామ్‌ప్ర‌సాద్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా, భాస్క‌ర‌భ‌ట్ట స‌హా ఎంటైర్ యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

నటీనటులు: 

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్: సి.వి.రావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా

మ్యూజిక్: రధన్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

డైలాగ్స్: పరుశురాం

ఫైట్స్: నందు

కొరియోగ్రఫీ: గణేశ్ స్వామి

పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

RDX Love Pre Release Event Highlights:

Celebrities speech at RDX Love Pre Release Event 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement