చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా పూజా కార్యక్రమం దసరా రోజు జరిగింది. ఈ చిత్రంలో చిరు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు అని వార్తలు వచ్చాయి. అలానే ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు అని గత కొన్ని రోజులు నుండి ఈ వార్త హల్ చల్ చేస్తున్నాయి. అయితే చరణ్ కేవలం అతిథి పాత్ర లేక ప్రత్యేక పాత్ర కాదని, ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి మల్టీస్టారర్‌గా తీర్చిదిద్దుతున్నారని సమాచారం.
మరి ఇందులో ఎంత నిజముందో మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది. సైరా ఇంటర్వ్యూలో చరణ్ తో కలిసి త్వరలోనే మల్టీస్టారర్ చేస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. దాని డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి అని చెప్పారు చిరు. అయితే అది కొరటాల సినిమాలోనా? లేదా లూసిఫెర్ రీమేక్ లో ఇద్దరూ కలిసి నటిస్తారా? అన్నది తెలియాల్సిఉంది.
ప్రస్తుతం మెగా అభిమానాలు అయితే పండగ చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తరువాత చిరుతో సినిమా చేస్తాడు అని అంటున్నారు. ఇక కొరటాల అండ్ చిరు సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్‌కి రిలీజ్‌కి సిద్ధ చేస్తారని సమాచారం.