చిరు డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా చిత్రంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిరంజీవి నటన గురించి అంతా మాట్లాడుతున్నారు. క్లైమాక్స్ లో ఆయన చేసిన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. టాలీవుడ్ నుండి ఇతర బాషల నుండి చాలా మంది సెలబ్రిటీస్ రెస్పాండ్ అవుతున్నారు. టాలీవుడ్ నుండి మహేష్ బాబు, నాగార్జున ఇంకా చాలామంది సినిమా చూసి తమ స్పందన తెలియజేశారు.
కానీ చరణ్ తో మంచి స్నేహం కలిగి ఉన్న ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు సైరా గురించి రెస్పాండ్ కాలేదు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులతో ఒకరైన రాజమౌళి కూడా సైరా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేయడం జరిగింది. చరణ్ - ఎన్టీఆర్ లు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మనం చాలా సందర్భాల్లో చూసాం. అటువంటి ఎన్టీఆర్ ఇప్పటివరకు సినిమాపై స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల సినిమా చూసే అవకాశం దక్కలేదేమో అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ కూడా సైరాపై ఇప్పటివరకు రెస్పాన్స్ కాలేదు.