Advertisementt

‘హౌజ్ ఫుల్ 4’ ప్రెస్‌మీట్ విశేషాలివే..!

Thu 10th Oct 2019 02:08 PM
housefull 4 movie,akshay kumar,pooja hegde,kriti kharbanda,kriti sanon  ‘హౌజ్ ఫుల్ 4’ ప్రెస్‌మీట్ విశేషాలివే..!
Housefull 4 Movie Press Meet ‘హౌజ్ ఫుల్ 4’ ప్రెస్‌మీట్ విశేషాలివే..!
Advertisement
Ads by CJ

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎంటర్‌టైనర్ హౌజ్ ఫుల్ 4. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో అక్షయ్ కుమార్‌తో పాటు హీరోయిన్లు కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్బందా హాజరయ్యారు. హౌజ్ ఫుల్ 4 బాల సాంగ్ ముచ్చట్లతో పాటు సినిమా విశేషాలను కూడా మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమా గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇందులో నా కారెక్టర్ పేరు బాల.. 1400లో పుడతాడు. హౌజ్ ఫుల్ 4 అనేది పూర్తిగా ఫన్ ఫిలిం. హౌజ్ ఫుల్ సిరీస్‌కు కంటిన్యూగా ఈ చిత్రం చేసాము. కాకపోతే క్యారెక్టర్స్ డిఫెరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా గురించి ఇంకేం చెప్పాలి.. పూర్తిస్థాయిలో సాగే ఫన్నీ సినిమా ఇది. ఇంతకంటే సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను. నాకు ఎప్పుడు హాలీడే కావాలనిపిస్తే అప్పుడు వెంటనే మరో ఆలోచన లేకుండా చేసే సినిమా హౌజ్ ఫుల్. ఈ సినిమా చేసినపుడు నేను చాలా రిలాక్స్ అవుతాను.. ఛిల్ ఔట్ అవుతాను. మీరు కూడా మీ కుటుంబంతో థియేటర్స్‌కు రండి.. ఫుల్లుగా నవ్వుకుని చిల్ ఔట్ కండి.. ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు సినిమాలో కనిపిస్తున్న గెటప్ కూడా మేకప్.. ఒరిజినల్ కాదు. నా కెరీర్ మొత్తంలో 30 ఏళ్లకు కష్టపడిన మేకప్ ఒక్క రజినీకాంత్ 2.0 సినిమాకే వేసుకున్నాను. మూడున్నర గంటలు వేసుకోడానికి.. గంటన్నర తీసేయడానికి పట్టేది. హౌజ్ ఫుల్ 4 మాత్రం త్వరగానే అయిపోయింది.. కచ్చితంగా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.. అని చెప్పారు.

పూజా హెగ్డే తన కారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఇందులో నేను న్యూ ఏజ్ గాల్ పాత్రలో నటించాను. ముఖ్యంగా 1419 పాత్ర చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నేను రాజకుమారిగా.. మోడ్రన్ అమ్మాయిగా రెండు పాత్రలు చేసాను. ముగ్గురం అక్కాచెల్లెళ్లుగా నటించాము.. రాజకుమారీలం.. మా ముగ్గురు ఆ ముగ్గురుతో చేసే పూర్తిస్థాయి కామెడీ ఫన్ ఫిలిం ఇది.. అని తెలిపారు.

కృతి సనన్ మాట్లాడుతూ.. ఈ కారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది.. సరదాగా అనిపించింది. 1419 పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. 2019 పాత్ర చేయడం ఈజీ.. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటామో మనకు తెలుసు. ఇక ఈ సినిమాలో మేము సిస్టర్స్. ముఖ్యంగా 1419 ప్రపంచం వేరు.. అప్పుడు ప్రపంచం ఎలా ఉండేదో మనకు తెలియదు.. ఐడియా లేదు. అలాంటి చోట మనం కామెడీ చేయాలి.. సినిమాలో డైలాగ్స్ కూడా నవ్వించడానికి చాలానే ఉన్నాయి. ప్రతీచోట ఫన్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి.. వాటిని ధరించడాన్ని నేను ఎంజాయ్ చేసాను. అక్షయ్ కుమార్ సర్‌తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను.. అని తెలిపారు.

కృతి కర్బందా మాట్లాడుతూ.. ముందుకు ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్.. ఈ సినిమాలో హైలైట్ కామెడీ. ఫుల్ ఫన్‌గా ఉంటుంది మా హౌజ్ ఫుల్ 4. ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు బాయ్స్‌తో కలిసి చేసే ఫన్ ఈ సినిమా. ప్రతీ ఒక్కరికి సినిమాలో నటించడానికి చాలా అవకాశం ఉంది.. దాంతో పాటే మా పాత్రల్లో కావాల్సినంత కామెడీ ఉంది.. విజువల్ గ్రాండియర్‌గా కూడా హౌజ్ ఫుల్ 4 ఉండబోతుంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా సినిమాలో డ్రామా కూడా చాలానే ఉంది. అని తెలిపారు.

Housefull 4 Movie Press Meet:

Housefull 4 Movie Details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ