దసరా సందర్భంగా విడుదలైన వెంకీ మామ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతుంది. వెంకీ మామ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ సినిమా ఇది. వెంకటేష్, నాగ చైతన్య కెమిస్ట్రీ ఈ టీజర్ కు ప్రధానమైన హైలైట్. మామ అల్లుడు పాత్రల్లో వాళ్ళిద్దరూ చక్కగా ఒదిగిపోయారు. ks రవీంద్ర (బాబీ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ లో సురేష్ బాబు మరియు టీజీ విశ్వప్రసాద్ వెంకీ మామ సినిమాను నిర్మిస్తున్నారు.
నటీనటులు:
వెంకటేష్, నాగ చైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్..
టెక్నికల్ టీం:
దర్శకుడు: కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాతలు: సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి