Advertisementt

నితిన్, కీర్తి సురేష్‌ల ‘రంగ్ దే’ ప్రారంభం

Tue 08th Oct 2019 06:24 PM
nithiin,keerthi suresh,rang de,rang de movie opening,rang de movie muhurat,venky atluri  నితిన్, కీర్తి సురేష్‌ల ‘రంగ్ దే’ ప్రారంభం
Nithiin and Keerthy Suresh Rang De Movie launched నితిన్, కీర్తి సురేష్‌ల ‘రంగ్ దే’ ప్రారంభం
Advertisement
Ads by CJ

యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ల తొలి కాంబినేషన్‌లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’ నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమ కథా చిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. ఈరోజు (8 - 10 - 2019 ) గం 10.49 ని..సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ‘రంగ్ దే’ ప్రారంభమయింది.

చిత్ర నాయకా, నాయిక‌లు నితిన్, కీర్తిసురేష్‌లపై సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ క్లాప్ నిచ్చారు. చిత్ర స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు)లు దర్శకుడు వెంకీ అట్లూరికి అందచేశారు. కెమెరా స్విచ్ ఆన్‌ను ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రగతి ప్రింటర్స్ అధినేత శ్రీ పరుచూరి మహేంద్ర చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, జెమిని కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథాచిత్రమిదని దర్శకుడు వెంకీ అట్లూరి’’ తెలిపారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించటం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ‘రంగ్ దే’కి ఆయన స్వరాలు ఓ ఆకర్షణ అన్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూగా జరుగుతుంది, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా, అడిషనల్ స్క్రీన్‌ప్లే : సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Nithiin and Keerthy Suresh Rang De Movie launched:

Nithiin Rang De Movie Launch Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ