Advertisementt

‘మ‌హాన‌టి’ తర్వాత నందినిరెడ్డితో..!

Tue 08th Oct 2019 05:54 PM
director,bv nandini reddy,swapna,cinema,production no 6,movie,details  ‘మ‌హాన‌టి’ తర్వాత నందినిరెడ్డితో..!
Swapna Cinema Production New Film Details ‘మ‌హాన‌టి’ తర్వాత నందినిరెడ్డితో..!
Advertisement
Ads by CJ

నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ప్న సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నెం.6 అనౌన్స్‌మెంట్‌

2018లో ‘మ‌హాన‌టి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన సంస్థ స్వ‌ప్న‌సినిమా సంస్థ ఆస‌క్తిక‌ర‌మైన సినిమాల‌ను నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. దీంతో పాటు ఈ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది.

నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు భావిస్తున్నారు. ఈ ఏడాది ‘ఓ బేబీ’ చిత్రంతో నందినీ రెడ్డి సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సాధించింది. ఇప్పుడు ఈమె ప్రియాంక ద‌త్ నిర్మాణంలో కాంటెంప‌ర‌రీ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించ‌నున్నారు. ‘మ‌హాన‌టి’, ‘ఓ బేబీ’ చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ల‌క్ష్మీ భూపాల్ ర‌చయిత‌గా ప‌నిచేస్తున్నారు. జ‌య‌శ్రీ ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తుండ‌గా.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

అటు నందిని రెడ్డి, ఇటు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ నిర్మించిన చిత్రాల‌న్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. అన్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలే. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో రాబోతున్న ఈ సినిమా కూడా ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేయ‌నుంది. త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం కానుంది.

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  BV నందిని రెడ్డి

నిర్మాత‌: ప‌్రియాంక ద‌త్‌

బ్యాన‌ర్‌:  స్వ‌ప్న సినిమాస్‌

మ్యూజిక్‌:  మిక్కీ జె.మేయ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  రిచర్డ్ ప్ర‌సాద్‌

ర‌చ‌యిత‌: ల‌క్ష్మీ భూపాల్‌

ఆర్ట్‌: జ‌య‌శ్రీ

Swapna Cinema Production New Film Details:

Director BV Nandini Reddy, Swapna Cinema Production No 6 Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ