స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో...’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది.
‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై విశేష ఆదరణకు నోచుకుంది. దసరా పండగ సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రానికి కూడా మంచి స్పందన లభిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో మాసీ లుక్ కనిపిస్తున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల అయిన ‘సామజవరగమన’ పాటకు విడుదలైన వారంలోనే 20 మిలియన్ వ్యూస్, 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా కానుకగా విడుదల చేసిన ఈ ప్రచార చిత్రానికి ఫ్యాన్స్ అందరు ఫిదా అవటమే కాకుండా ట్రేడ్ లో సూపర్ బజ్ తీసుకొచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
యాక్షన్ లుక్ లో కూడా ఒక కథని చెప్పేవిధంగా పోస్టర్ విడుదల చేయటం గమనించదగ్గ విషయం. అల్లు అర్జున్, త్రివిక్రమ్.... వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను, విశేషాలను వరుసగా తెలియపరుస్తాము. సోషల్ మీడియాలో ఈ సినిమా అప్డేట్ వస్తోందంటే లక్షల సంఖ్యలో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి మరిన్ని విశేషాలని అందించే విధంగా చిత్ర యూనిట్ సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకాభిమానులందరికీ, మీడియా వారికి చిత్ర యూనిట్ విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తోంది.
‘అల వైకుంఠపురములో’ ని తారలు:
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)