సైరా సినిమా హిట్ టాక్‌తో డివైడ్ కలెక్షన్స్‌తో థియేటర్స్‌లో రన్ అవుతుంది. కొన్నిచోట్ల మినహా సైరా సినిమా కలెక్షన్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. విడుదలైన రోజు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించినా సైరా గురు శుక్రవారాల్లో కలెక్షన్స్ మరీ డ్రాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కి టెన్షన్ పట్టుకుంది. అయితే శని ఆదివారాల్లో అయినా సై రా కలెక్షన్స్ పుంజుకుంటాయనుకుంటే.... అదీ అంతగా లేదు. ఓవర్సీస్‌లో అయితే సైరా పరిస్థితి మరీ దారుణంగా వుంది.
అయితే సైరా సినిమా కలెక్షన్స్ శనిఆదివారాల్లోనూ పెరగకపోవడానికి కారణం ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం సైరా సినిమాకి ప్రతికూలంగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఏరియాలను బట్టి 150 నుండి 300 రూపాయల వరకూ టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేయడంతో ఫుట్ ఫాల్స్ తగ్గాయని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే శని ఆదివారాలు వెళ్లినా.. ఇంకా దసరా సెలవలు రెండు రోజులు ఉన్నాయి కాబట్టి సినిమా కలెక్షన్స్ పెరగొచ్చు అని అంటున్నారు.