వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ కైలాసపురం కింగ్స్ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నిర్మాత రాజ్ కందుకూరి, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత రిజ్వాన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ...ఈ సినిమా నేను చూశాను, బాగా నచ్చింది. వైజాగ్ నేపథ్యంలో జరిగే మాస్ ఎంటర్టైన్ సబ్జెక్ట్ ఇది. కేరాఫ్ కంచరపాలెం సినిమా తరహాలో ఈ సినిమా ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయనుంది. ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కైలాసపురం కింగ్స్‌లో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను.. అన్నారు.
నిర్మాత తేజ్ మాట్లాడుతూ.. నాకు వైజాగ్ అంటే ప్రాణం. వైజాగ్‌లో జరిగే చిత్ర షూటింగ్స్‌కు నేను హెల్ప్ చేస్తుంటాను. నాకు ఈ చిత్ర కథ దర్శకుడు కులదీప్ చెప్పగానే నచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది అన్నారు.
డైరెక్టర్ కులదీప్ రాజన్ మాట్లాడుతూ.. నేను రాసుకున్న కథకు హీరో రమేష్ పూర్తి న్యాయం చేశాడు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. నిర్మాత తేజ్ వైజాగ్ గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ సినిమాను బాగా నిర్మించారు.. అన్నారు.
మనిక్ బాషా హీరో సందీప్.. కైలాసపురం కింగ్స్ హీరో రమేష్ నాకు బాగా ఫ్రెండ్, తను మంచి నటుడు. కైలాసపురం టీజర్ చూస్తుంటే తెలుస్తోంది తాను నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని నమ్మకం కలిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
హీరో రమేష్ మాట్లాడుతూ.. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రిజ్వాన్ గారికి థాంక్స్. కైలాసపురం అనేది పక్కా మాస్ ఎంటర్టైనర్ అందరికి నచ్చే సినిమా ఇది అన్నారు.
హీరోయిన్ గరిమా సింగ్ మాట్లాడుతూ.. నాకు కైలాసపురం సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేమలో ఉన్న కొత్త కోణాన్ని ఈ సినిమాలో దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. త్వరలో రానున్న ఈ సినిమా మీకు నచ్చుతుంది అన్నారు.
నటీనటులు:
రమేష్ కుర్మాపు
గరిమా సింగ్
ప్రసన్న కుమార్
శ్రీమణి
సాంకేతిక నిపుణులు:
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కులదీప్ రాజన్
బ్యానర్: వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ
నిర్మాత: క్రౌడ్ ఫండింగ్
డైలాగ్స్: అరుణ్ వైరిచర్ల
మ్యూజిక్: త్రినాధ్ మంతెన
కెమెరామెన్: జాన్ విక్టర్ పాల్
కాస్టూమ్ డిజైనర్: అరుంధతి బిజ్జ
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్