సాయితేజ్ హీరోగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ప్రారంభమైన ‘సోలో బ్రతుకే సో బెటర్’
సాయితేజ్, నభానటేశ్ జంటగా నటిస్తోన్న చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
సాయితేజ్, నభా నటేశ్
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సుబ్బు
నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్