యాక్షన్ మూవీ సాహోని బాలీవుడ్ జనాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ..... నెత్తిన పెట్టుకుని మరీ హిట్ చేశారు. కానీ హిట్ టాక్ తెచ్చుకున్న సైరా నరసింహారెడ్డి సినిమాకి హిందీ ప్రేక్షకులు చుక్కలు చూపెడుతున్నారు. సైరా సినిమాకి ఫస్ట్ షోకే హిట్ టాక్ పడింది. అయినప్పటికీ సైరా సినిమాని చూడడానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. సైరా వసూళ్లు చూస్తుంటే... ఆ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఎంత హేట్ చేస్తున్నారో చూసి ఆ సినిమాని భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నోట మాటరావడం లేదు.
బాహుబలి రేంజ్ ఉన్న సై రా సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఓ యాక్షన్ మూవీ వార్ కోసం పక్కన బెట్టారంటే నమ్మలేకపోతున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం సై రా బాలీవుడ్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అమితాబ్ లాంటి మెగాస్టార్ సై రాలో నటించినప్పటికీ... సైరాని బాలీవుడ్ ప్రేక్షకులు చిన్న చూపు చూస్తున్నారంటే ఎవరి నోట మాట రాని పరిస్థితి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు సైరాకి హిందీలో ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ శని, ఆదివారాల్లో ఏమైనా సై రా బాలీవుడ్ లో పుంజుకుంటుందేమో చూడాలి.